ఒకప్పుడు పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) అంటే పెద్దగా ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి తెలియని వారెవరు లేరు.కామన్ మాన్ గా అనేక కష్టాలు పడి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్.
అక్కడికి వెళ్లిన తర్వాత అద్భుతమైన అటు తీరని కనబరిచి అందరికీ షాక్ ఇచ్చాడు.ఎవరు ఊహించని స్థాయిలో బిగ్ బాస్ విన్నర్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
పల్లవి ప్రశాంత్ ముందుగా టిక్ టాక్ లో వీడియోలు చేసేవాడు, యూట్యూబ్ లో కూడా ఒక ఛానల్ పెట్టి వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేసేవాడు.
తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునేవాడు.
తల్లికి సాయం చేస్తూ ఇల్లు వాకిలి ఊడుస్తున్న ఆ వీడియోలు కూడా యూట్యూబ్ ఛానల్( YouTube channel ) లో షేర్ చేసుకునేవాడు.అయితే బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ కధ మారిపోయింది.
బిగ్ బాస్ గా విన్నర్ ( Bigg Boss Winner ) అయిన ప్రశాంత్ ఇప్పుడు అతని కి వచ్చిన క్రేజ్ కారణంగా హుందాగా ఉండాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.బిగ్ బాస్ లో ఉన్నప్పుడు శివాజీ చెప్పిన మాటలు బుర్రలో పెట్టుకున్న ప్రశాంత్ పిచ్చిపిచ్చి వీడియోలు చేయకూడదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
![Telugu Bigg Boss, Biggboss, Nagarjuna-Movie Telugu Bigg Boss, Biggboss, Nagarjuna-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/bigg-boss-season-7-winner-pallavi-prashanth-back-to-farminga.jpg)
అందుకే బిగ్ బాస్ అయిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నా ఆయన మాత్రం ఒక వీడియో కూడా చేయలేదు.ఇక బిగ్ బాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు,పార్టీలు, ఫంక్షన్లు, టీవీ చానల్స్ ప్రోగ్రాములు ఇలా చాలా హడావిడిగా గడిపాడు.ఇకమీదట పల్లవి ప్రశాంత్ ఇంతకు ముందులాగా రైతుబిడ్డ గా ఉంటాడని ఎవరు ఊహించి ఉండరు.ఎందుకంటే ఒకసారి తళుకు బెలుకుల జీవితానికి అలవాటు పడిన వాళ్ళు మట్టి పనులు చేయడానికి అంతగా ఇష్టపడరు.
![Telugu Bigg Boss, Biggboss, Nagarjuna-Movie Telugu Bigg Boss, Biggboss, Nagarjuna-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/bigg-boss-season-7-winner-pallavi-prashanth-back-to-farmingb.jpg)
కానీ పల్లవి ప్రశాంత మాత్రం ట్రాక్టర్ లో ప్రత్తి సంచులు వేసుకొని మార్కెట్ కి వెళ్లి, ఆయనే వాటిని నేరుగా దించి కాటా వేయించాడు.అక్కడున్న వాళ్ళందరితోని చక్కగా మాట్లాడాడు.సెల్ఫీలు అడిగిన వాళ్ళకి కాదనకుండా సెల్ఫీలు కూడా ఇచ్చాడు.ఆ తరువాత తన తండ్రి వచ్చి డబ్బులు తీసుకున్నాడు పత్తి అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకుని కొడుకుతో ఇంటికి బయలుదేరాడు ఆ తండ్రి.
ఈ క్రమంలో టీ షాప్ మహిళ రైతు బిడ్డపై ప్రేమను కురిపించింది, నీకు ఓటేసి గెలిపించాను అని చెప్పటంతో చాలా ఆనందపడ్డాడు ప్రశాంత్.