బీసీసీఐ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
మహిళా క్రికెటర్లపై ఉన్న వివక్షను పారద్రోలేలా.వారి చెల్లింపుల్లో ఈక్విటీ విధానాన్ని అమలు చేయనుంది.
ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు.ఇకపై మెన్స్ టీమ్ తో సమానంగా ఉమెన్స్ టీమ్ కు మ్యాచ్ ఫీజు చెల్లింపులు ఉండనున్నాయి.దీనిలో భాగంగా టెస్టులకు రూ.15 లక్షలు, వన్డేలకు రూ.6 లక్షలు, టీ20 లకు రూ.3 లక్షలు మ్యాచ్ ఫీజును చెల్లించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.