టాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు చెప్పుకోలేని కష్టం వచ్చిందట.ఈ విషయం ఇప్పుడు అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆ స్టార్ ప్రొడక్షన్ సంస్థ వారుగా స్టార్ హీరోలతో పలు క్రేజీ సినిమాలను లైన్లో పెడుతుంది.అయినా కూడా ఈ నిర్మాణ సంస్థకు పెద్ద కష్టం వచ్చింది అని ఆ సినిమాలను అధికారికంగా ప్రకటించడానికి వీలు కావడం లేదని వాపోతున్నారట.
మరి ఇంతకీ ఆ నిర్మాణ సంస్థ ఏంటంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.ఈ సంస్థ అగ్ర హీరోలతో సినిమాలు లైన్లో పెట్టింది.అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లతో.కానీ ఈ ఇద్దరు హీరోలతో చేస్తున్న సినిమాలను ప్రకటించలేని పరిస్థితి.కార్తికేయ 2 వంటి బంపర్ హిట్ అందుకున్న తర్వాత ఈ సంస్థ బాగా పాపులర్ అయ్యింది.
ప్రెజెంట్ ఈ సంస్థ రవితేజతో ధమాకా సినిమా చేసి రిలీజ్ కు రెడీగా ఉంచింది.
ఇక ప్రభాస్, మారుతి కాంబోలో ఒక సినిమాను సెట్ చేసారు.డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ.
ఫైనల్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతికి వచ్చినట్టు టాక్.ఇప్పటికే ఈ సినిమా సైలెంట్ గా సెట్స్ మీదకు వెళ్లినట్టు టాక్.
అయినా కూడా అధికారికంగా అనౌన్స్ చేయలేదు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఒక రీమేక్ సినిమాను చేసినట్టు టాక్.వినోదయ సీతం రీమేక్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నే నిర్మిస్తుంది అని తెలుస్తుంది.ఈ సినిమాను కూడా అనౌన్స్ చేయలేక పోతున్నారు.
ఇలా ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ తలపెట్టిన రెండు సినిమాలను అనౌన్స్ చేయలేని పరిస్థితి.ఇక ఈ రెండు సినిమాల విషయంలో కూడా ఫ్యాన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
అందుకే షూట్ కొంత భాగం అయ్యాక అనౌన్స్ చేస్తారేమో చూడాలి.