ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటిలో అన్ స్టాపబుల్ షో సీజన్2 ప్రసారమవుతుండగా ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సెకండ్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ మాట్లాడుతూ డీజే టిల్లు2 సినిమాకు బెస్టాఫ్ లక్ చెప్పారు.
ఫోన్ ఎత్తు ఎన్నిసార్లు ఫోన్ చేయాలంటూ సిద్ధు బ్రదర్ సూచనలు చేశారు.సిద్ధు కొన్ని చిరాకు పుట్టించే పనులు చేస్తాడని అతని బ్రదర్ కామెంట్లు చేశారు.
నంబర్ వన్ ఫోన్ ఎత్తడని సిద్ధు బ్రదర్ తెలిపారు.సిద్ధును పెళ్లి చేసుకోమని చెప్పాలని వాడి పెళ్లి అయితే కానీ నా పెళ్లి కాదని సిద్ధు బ్రదర్ అన్నారు.
మా ఇంటి ఆచారం ప్రకారం చిన్నవాడికి మొదట పెళ్లి చేస్తారని సిద్ధు బ్రదర్ చెప్పుకొచ్చారు.వాడి పెళ్లి అయితే నా పెళ్లి అవుతుందని సిద్ధు బ్రదర్ పేర్కొన్నారు.
మీ బ్రదర్ తరపున అడుగుతున్నానని ఒకసారి పెళ్లి చేసుకోవాలని బాలయ్య సిద్ధుకు సూచించారు.
పెళ్లి చేసుకోవాలంటే నిన్ను బాగా చూసుకునే అమ్మాయిని నీకు బాగా కోపరేట్ చేసే అమ్మాయిని అన్ని విషయాల్లోనూ నిన్ను అర్థం చేసుకుని ప్రేమను పంచే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు.
కాకపోతే ఈ గుణాలన్నీ ఒకమ్మాయిలో దొరకవని ఒకమ్మాయికి ఇంకో అమ్మాయికి పరిచయం లేకుండా చూసుకోవాలని బాలయ్య సిద్ధుకు చెప్పుకొచ్చారు.

లైఫ్ అనేది నాన్ స్టాప్ రన్నింగ్ రేస్ అని బాలయ్య తెలిపారు.బిగ్ బయ్ ఏంటని బాలయ్య అడగగా సిద్ధు, విశ్వక్ సేన్ కారు అని వెల్లడించారు.నేను డ్రైవింగ్ చేస్తే అందరూ భయపడతారని బాలయ్య అన్నారు.
పైసా వసూల్ షూట్ సమయంలో శ్రియ భయపడిందని బాలయ్య కామెంట్లు చేశారు.బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.