కన్నబిడ్డలను దారుణంగా హత్య చేసిన తండ్రిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడిని భారత సంతతికి చెందిన సిక్కు వ్యక్తి కమల్‌జిత్ అరోరాగా గుర్తించారు.
ఇతనిపై రెండు ఫస్ట్ డిగ్రీ హత్య కేసు అభియోగాలను మోపినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.అక్టోబర్ 17న మాంట్రియల్‌కు ఉత్తరాన వున్న ఇంట్లో 11, 13 ఏళ్లు వున్న కొడుకు , కుమార్తెలను కమల్ హత్య చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ప్రాసిక్యూటర్లు చెబుతున్న దానిని బట్టి నిందితుడు అతని భార్యను కూడా గొంతు పిసికి చంపినట్లుగా తెలుస్తోంది.దీనికి గాను కమల్‌పై ఒక కౌంట్ అభియోగం నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి కమల్ అక్టోబర్ 19న కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాల్సి వుంది.అయితే అతను హాజరకావడానికి శరీరం సహకరించకపోవడంతో విచారణ వాయిదా వేయాలని ప్రాసిక్యూటర్లు కోరారు.
దీనికి న్యాయస్థానం సమ్మతించింది.ఇంతటి దారుణం జరిగినా.
విషయం కనీసం ఇరుగు పొరుగుకు కూడా తెలియకపోవడం గమనార్హం.పోలీసులు వచ్చిన తర్వాతే విషయం బయటపడటంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు లావల్ స్టె డోరతీ సెక్టార్‌లోని ఇంటికి వెళ్లగా.అక్కడ ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో పడివున్నారు.వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు సీటీవీ న్యూస్ నివేదించింది.కమల్ జిత్ కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ వుండటంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
మీడియాలో వస్తున్న కథనాలను బట్టి.ఈ ఘటన గురించి కమల్ జిత్ పెద్ద కుమార్తె స్థానికులు అప్రమత్తం చేసింది.

లావల్ మేయర్ స్టెఫాన్ బోయర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సోమవారం రాత్రి బాధితులకు సంతాపం చెబుతూ ట్వీట్ చేశారు.అయితే మరణానికి దారి తీసిన కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.







