బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కూడా మనందరికీ సుపరిచితమే.
అర్బాజ్ ఖాన్ తాజాగా తనావ్ ( ఒత్తిడి)అనే వెబ్ సిరీస్ లో నటించాడు.ఈ వెబ్ సిరీస్ ఈ నెల 11 నుంచి సోనీ లివ్ లో ప్రసారం కానుంది.
కాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు అర్బాజ్ ఖాన్.ఈ క్రమంలోని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్బాజ్ ఖాన్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఒత్తిడి గురించి చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ.
మనం నిత్యం ఒత్తిడితో సతమతం అవుతూనే ఉంటాము.
జీవితంలో ఒత్తిడికి లోనవ్వని సందర్భాలు అంటూ ఉండవు.ఇప్పుడు మన మెదడులో ఏదో ఒక స్ట్రెస్ ఉండనే ఉంటుంది.
పని గురించి డబ్బు గురించి రిలేషన్షిప్ గురించి లేదంటే మన ఆరోగ్యం గురించి లేదంటే ఫ్యామిలీ విషయాల గురించి ఇలా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటాము.అలా నిత్యం ఏదో ఒక దాని కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము.
ఈ నేపథ్యంలోనే జీవితమంతా కాస్తో కూస్తో ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది.కానీ దానిని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాము అన్నదే ముఖ్యం.
![Telugu Arbaaz Khan, Arhan Khan, Dabangg, Malaika Arora, Salman Khan, Tandav Web- Telugu Arbaaz Khan, Arhan Khan, Dabangg, Malaika Arora, Salman Khan, Tandav Web-](https://telugustop.com/wp-content/uploads/2022/11/Arbaaz-Khan-tandav-web-series.jpg )
చిన్న వయసులో నేను చాలా వాటి కోసం టెన్షన్ పడేవాడిని.20 ఏళ్ల వయసులో కెరీర్ గురించి ఆ తర్వాత జీవితం గురించి ఇలా ఒత్తిడి అనేది ఏదో ఒక రూపంలో మన ముందుకు వస్తూనే ఉంటుంది అని చెప్పుకొచ్చాడు అర్బాజ్ ఖాన్.ఇప్పుడు నేను అన్నింటిని స్వీకరిస్తూ ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకు వెళుతున్నాను అని తెలిపాడు.కాగా అర్బాజ్ ఖాన్ దబాంగ్ సినిమాతో నిర్మాతగా మారిన విషయం మనందరికీ తెలిసిందే.1998లో అర్బాజ్ ఖాన్ సీనియర్ నటి అయినా మలైకా అరోరా ను పెళ్లి చేసుకున్నాడు.వీరికి 2002లో అర్హాన్ ఖాన్ అనే బాబు కూడా జన్మించాడు.
ఆ తర్వాత ఈ జంట 2017లో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం మలైకా అరోరా బాలీవుడ్ యంగ్ హీరో అయినా అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నావు విషయం అందరికి తెలిసిందే.
ఇదే విషయాన్ని ఆ జంట సోషల్ మీడియా వేదిక తెలపడంతో పాటు ఇద్దరు చట్టపట్టలేసుకొని మరి తిరుగుతూ ఉన్నారు.అంతేకాకుండా వారి ఏజ్ విషయంలో వార్తలు వచ్చిన ప్రతీసారి ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు.