సివిల్ ఇంజనీర్స్( Civil Engineers ) తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న యూకేలోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్( Civil Engineers in UK ) (ఐసీఈ)కు ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన అనూషా షా ఎంపికయ్యారు.తద్వారా 205 సంవత్సరాల చరిత్ర గల ఐసీఈకి ఎన్నికైన తొలి భారత సంతతి అధ్యక్షురాలిగా అనూష( Anusha ) చరిత్ర సృష్టించారు.
ఈ సంఘంలో దాదాపు 95000 వేల మంది సభ్యులుగా వున్నారు.ఐసీఈ 159వ ప్రెసిడెంట్‌గా మంగళవారం సాయంత్రం లండన్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో అనూషా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ‘‘ nature-positive civil engineering ’’ అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు.అనూషా షాకు యూకేతో పాటు అంతర్జాతీయంగా ప్రాజెక్ట్‌ల రూపకల్పన, నిర్వహణలో 22 ఏళ్ల అనుభవంతో పాటు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో నైపుణ్యం వుంది.

మౌలిక సదుపాయాలు, ప్రకృతికి మధ్య వున్న పరస్పర సంబంధాన్ని అర్ధం చేసుకోవడంలో తాము విఫలమయ్యామని అనూషా షా వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ఆధారిత హరిత పరిష్కారాలను అమలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.భూమ్మీద 30 శాతం జీవవైవిధ్య నష్టానికి ‘‘ నిర్మాణం ’’ అనేది ఎక్కువ బాధ్యత వహిస్తుందని అనూష అభిప్రాయపడ్డారు.అయితే ప్రకృతికి అనుకూలమైన విధానాన్ని అవలంభించడం వల్ల పర్యావరణ క్షీణతను అరికట్టడానికి ఇంజనీర్లకు వీలు కలుగుతుందని ఆమె తెలిపారు.
సివిల్ ఇంజనీర్లు మౌలిక సదుపాయాలకు, ప్రకృతికి మధ్య వున్న పరస్పర సంబంధాన్ని బాగా అర్ధం చేసుకోవడానికి, మరిన్ని ప్రయోగాలు చేయడానికి సమయం ఆసన్నమైందని అనూష అన్నారు.మన సహజ ప్రపంచానికి హాని కలిగించే ఆస్తులను నిర్మించడం మంచిది కాదన్నారు.
ప్రకృతికి అనుకూలంగా వుండటం తప్పించి మనకు వేరే మార్గం లేదని ఆమె తేల్చిచెప్పారు.

ఇకపోతే.భారత్‌లోని జమ్మూకాశ్మీర్‌లో( Jammu Kashmir, India ) పుట్టి పెరిగిన షాకు అక్కడి అందమైన పరిసరాలు, అంతర్నిర్మిత అంశాలు చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగించాయి.23 ఏళ్ల వయసులో న్యూఢిల్లీలో కాశ్మీర్‌లోని దాల్ సరస్సు( Dal Lake ) పరిరక్షణపై పనిచేస్తున్న కన్సల్టెన్సీని వెతికి పట్టుకున్నారు.ఈ సందర్భంగా కన్సల్టింగ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పాత్ర గురించి ఈ సంస్థ యాజమాన్యంతో చర్చించారు.1999లో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ స్కాలర్షిప్ను గెలిచిన ఇద్దరు అభ్యర్ధుల్లో ఆమె ఒకరు.యూనివర్సిటీ ఆఫ్ సర్రేలో వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ అభ్యసించడానికి అనూషా షా యూకేకి వచ్చారు.ఇంజనీరింగ్‌లో వాతావరణ మార్పులకు ఆమె చేసిన సేవలకు గాను ఈస్ట్ లండన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.