ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోతుందని టీడీపీ నేత యనమల అన్నారు.రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి జగన్ కు వ్యతిరేక గాలి వీస్తోందని తెలిపారు.
ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ నేతలు ఒక్కొక్కరుగా జగన్ ను వదిలేస్తున్నారని యనమల పేర్కొన్నారు.జగన్ టికెట్ ఇస్తామన్న తమకు వద్దంటున్నారని చెప్పారు.అలాగే జగన్ వదిలిన బాణం తిరిగి జగన్ వైపే దూసుకెళ్తోందని తెలిపారు.2024 ఎన్నికల్లో విజయం సాధించేది టీడీపీనేని ధీమా వ్యక్తం చేశారు.