తెలంగాణ రాష్ట్రం రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో పలు అసాంఘిక కార్యకలాపాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.తాజాగా నలుగురు యువకులు ఓ మహిళను దుస్తులు విప్పి తమ ముందు డాన్స్ చేయాలంటూ వేధించారు.
ఇందుకు ఆమె ససేమిరా అనడంతో ఆమెపై దారుణంగా దాడి చేసిన ఘటన హైదరాబాదు నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే అమీర్ అనే యువకుడు స్థానిక నగరంలో నివాసం ఉంటున్నాడు.
అయితే ఈనెల 22వ తారీఖున అతని పుట్టిన రోజు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఓ మహిళ కి పుట్టినరోజు వేడుకల ఈవెంట్ ని అప్పగించారు.దీంతో ఆ మహిళ అమీర్ పుట్టినరోజు వేడుకలను బాగానే నిర్వహించింది.
అయితే ఇందులో భాగంగా పుట్టిన రోజునాడు అమీర్ ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి మహిళను బంధించి తన స్నేహితుల ఎదుట దుస్తులు విప్పి డాన్స్ చేయమని బెదిరించాడు.అందుకు ఆ మహిళ ఒప్పుకోలేదు.
దీంతో ఆగ్రహానికి గురైన టువంటి అమీర్ ఆమెపై దారుణంగా దాడి చేశాడు.అనంతరం మహిళని ఓ గదిలో బంధించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే వారి వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న మహిళ వెంటనే స్థానికుల సహాయంతో ఇంటికి చేరుకుంది.దీంతో తనపై గాయాలను గమనించినటువంటి మహిళ భర్త ఏమైందని అడగ్గా ఆమె తనపై జరిగిన అన్యాయం గురించి తన భర్తకి తెలిపింది.దీంతో అతడు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్య పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేశాడు.ఈ విషయం తెలుసుకున్న టువంటి నిందితుడు అమీర్ తన స్నేహితులతో కలిసి పరారీలో ఉన్నాడు.
దీంతో బాధితురాలు తెలిపిన టువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
.