రెండు దశాబ్ధాలుగా యాంకర్ గా తన ప్రస్థానం కొనసాగిస్తున్న సుమ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుంది.ఒకప్పుడు వెండితెర మీద కనిపించి అలరించిన సుమ బుల్లితెర మీద యాంకర్ గా కొనసాగుతూ వెండితెరకు దూరమైంది.
లేటెస్ట్ గా మళ్లీ సుమ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్ అయ్యింది.సుమ లీడ్ రోల్ లో జయమ్మ పంచాయితీ సినిమా మొదలైంది.
ఈ సినిమా మోషన్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు.విజయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందించడం విశేషం.
ఇన్నాళ్లు బుల్లితెర మీద తన షోస్ తో సందడి చేసిన సుమ సడెన్ గా ఇలా ఫీమేల్ లీడ్ మూవీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కాని సుమ జయమ్మ పంచాయతీ పోస్టర్ మాత్రం క్రేజీగా మారింది.
రాం చరణ్ రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.యాంకర్ గా మూడు షోలు.ఆరు ఈవెంట్లు అన్నట్టుగా సాగుతున్న సుమ కెరియర్ లో మళ్లీ ఇలా సినిమాలవైపు మనసు మళ్లడంపై అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు.తప్పకుండా సుమ చాలా రోజుల తర్వాత సోలోగా చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.