అమెరికాలో పిల్లి ఇప్పుడు హై రేంజ్ సెలబ్రిటీ...అసలేం జరిగిందంటే..!!!

ఒక్కో సారి సుడి గట్టిగా తిరిగితే మూటలు మోసుకునే వ్యక్తి మిలీనియర్ కూడా అవుతాడు.లక్కు ఉండాలే కానీ ఊహించని ఎన్నో పరిణామాలు మన కళ్ళ ముందే జరిగిపోతూ ఉంటాయి.

 America, News 14, Weather Report, Cat, Live, Celebrity, Instagram, Jeffi-TeluguStop.com

అలాంటి సందర్భమే ఇప్పుడు అమెరికాలో చోటు చేసుకుంది.ఓ పెంపుడు పిల్లి ఒక్క సారిగా అమెరికాలో సెలబ్రిటీ అయ్యిపోయింది.

కేవలం ఒకే ఒక్క కారణం ఆ పిల్లిని పబ్లిక్ ఫిగర్ చేసేసింది.ఇంతకీ అసలేం జరిగిందంటే.

అమెరికాకి చెందిన జెఫ్ఫీ అనే వ్యక్తి స్థానికంగా 14న్యూస్ లో వెదర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు.ఎప్పటిలానే వెదర్ రిపోర్ట్ చదువుతున్నాడు ఈక్రమంలోనే ఒక్క సారిగా తాను రిపోర్ట్ చేస్తున్న సమయంలో తన పెంపుడు పిల్లి బెట్టి లైవ్ లోకి వచ్చేసింది.

దాంతో షో చూస్తున్న ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు.అంతేకాదు ఆ షో కి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది.మరుసటి రోజు అతడు ఒక్కడే రిపోర్ట్ చేస్తుండగా ప్రేక్షకులు పిల్లి గురించి వివరాలు అడగడం మొదలు పెట్టారు.

Telugu America, Celebrity, Jeffi, Live-

దాంతో న్యూస్ 14 యాజమాన్యం మరుసటి రోజునుంచీ బెట్టిని కూడా అతడితో పాటు లైవ్ లో ఉంచడం మొదలు పెట్టింది.అది చేసే చేష్టలు అల్లరికి ప్రేక్షకులు ఫిదా అయ్యిపోవడంతో ఊహించని విధంగా షోకి రేటింగ్ పెరిగిపోయింది.అప్పటి నుంచీ ఆ పిల్లి బెట్టి సూపర్ సెలబ్రిటీగా మారిపోయింది.

అంతేకాదు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చికుంది.దాంతో దాని పేరుమీద ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి దాని అభిమానుల కోసం వీడియోలు షేర్ చేస్తున్నాడు జెఫ్ఫీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube