నటిగా నేను చాలా డిఫరెంట్ అంటున్న ఆర్ఆర్ఆర్ భామ

బాలీవుడ్ లో ప్రస్తుతం తిరుగులేని హీరోయిన్ గా వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్న భామ అలియా భట్.ఈ అమ్మడు నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది.

 Alia Bhatt Fallow Switch Of And Switch On Theory, Bollywood, Tollywood, Rrr Movi-TeluguStop.com

స్టార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తన నటనతో బాలీవుడ్ లో సుస్థిర స్థానం సంపాదించుకుంది.ఇప్పుడు పెద్ద సినిమాలు అన్ని కూడా అలియా భట్ కోసమే ఎదురుచూస్తున్నాయి.

కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాతో పాటు మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో కూడా అలియా హీరోయిన్ గా చేస్తుంది.అలాగే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కి జోడీగా అలియా భట్ కనిపించబోతుంది.

ఇదిలా ఉంటే అలియా నటిస్తున్న ప్రతి సినిమాలో పాత సినిమా ప్రభావం పడకుండా చూసుకుంటుంది.సినిమాలో అలియా కాకుండా కేవలం హీరోయిన్ పాత్ర స్వభావంలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర మాత్రమే తెరపై కనిపించేలా చేస్తుంది.

అందుకే దర్శకులు కూడా అలియా భట్ కి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు.వరుస సినిమాలు చేస్తున్న కూడా తన పాత్రల విషయంలో మాత్రం అలియా కన్ఫ్యూజన్ లో ఉండకపోవడానికి కారణం తాజాగా సోషల్ మీడియాలో లైవ్ లో ఫ్యాన్స్ తో చెప్పుకొచ్చింది.

తాను స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ పద్ధతిని సినిమాల విషయంలో ఫాలో అవుతా అని అలియా చెప్పింది.ఒక సినిమాలో క్యారెక్టర్ చేసేంత వరకు ఆ పాత్రలో ఉంటా అని ఒక్కసారి లొకేషన్ దాటి బయటకి వస్తే అక్కడే ఆ పాత్రని మరిచిపోతా అని చెప్పింది.

కెమెరా ముందు ఉన్నప్పుడు మాత్రమే నేను సినిమాలో క్యారెక్టర్ లో ఉంటాను.బయట కూడా అదే పాత్ర మైకంలో ఉంటే మరో సినిమా చేయలేం.ఏ సినిమాకి ఆ సినిమా, ఏ పాత్రకి ఆ పాత్ర అన్నట్లుగానే ఉంటా అందుకే సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తా అని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube