స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి…( Director Rajamouli ) ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ తో( NTR ) మరొక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి.
అయితే వీళ్ళ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుంది అనే అనుమానలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అయితే రాజమౌళి పౌరాణికానికి సంబంధించిన ఒక సినిమాని ఎన్టీయార్ తో చేయాలనుకున్నట్టుగా తెలుస్తుంది.అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం( Mahabharatam ) అయినప్పటికీ మధ్యలో మరొక పౌరాణిక కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.ఇక దానికోసమే ఆ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేయాలని చూస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమాతో జత కడితే వీళ్ళిద్దరూ ఐదుసార్లు కృతకట్టినట్టుగా అవుతుంది.కాబట్టి రాజమౌళి డైరెక్షన్ లో ఎప్పుడైనా సరే సినిమా చేయడానికి ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి ఈ సినిమా ను ఎలాగైనా సరే చేసి సక్సెస్ అందుకోవాలని ఎన్టీఆర్ ఆరాటపడుతున్నట్టుకు తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ తన నటనతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) చేస్తున్నాడు.కాబట్టి ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి మరొక మూడు సంవత్సరాలు ఈజీగా పడుతుంది.
కాబట్టి ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కూడా కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి రాజమౌళితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టలెక్కుతుంది అనేది…ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో చేసే సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…








