2019 చివరిలో చైనాలో( China ) పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన నాలుగేళ్ల కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా .
లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.
నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.లక్షలాది మంది రోడ్డునపడ్డారు.
ఇలా ఒకటి కాదు.రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.
అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కోవిడ్ తీవ్రత తగ్గింది.అయినప్పటికీ కొత్త కొత్త వేరియంట్లు మానవాళిపై దాడి చేస్తూనే వున్నాయి.
శాస్త్రవేత్తలు సైతం కరోనా ముప్పు ఇంకా తప్పిపోలేదని హెచ్చరిస్తూనే వున్నారు.
నాలుగేళ్ల క్రితం కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయబడినప్పటి నుంచి విద్యార్ధులు నేర్చుకోవడానికి, అధ్యాపకులు ఎదురుదెబ్బలను అధిగమించడానికి ఇంకా పరిగెత్తుతూనే ఉన్నారు.
కోవిడ్ నుంచి కోలుకుని విద్యార్ధులను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి కొన్ని అమెరికా పాఠశాలలు పురోగతి సాధించాయి.ఎడ్యుకేషన్ రికవరీ స్కోర్‌కార్డ్ ప్రకారం( Education Recovery Scorecard ).హార్వర్డ్ , స్టాన్‌ఫోర్డ్ పరిశోధకుల ప్రకారం.వర్జీనియా సహా 9 రాష్ట్రాల్లో రీడింగ్ స్కోర్లు తగ్గుతూనే ఉన్నాయి.
విద్యార్ధులు తిరిగి పాఠశాలకు చేరుకోవడం, ఆర్ధిక సంక్షోభాన్ని నివారించడానికి ఫెడరల్ పాండమిక్ రిలీఫ్ ( Federal Pandemic Relief )కింద ప్రకటించిన 190 బిలియన్ల డాలర్ల నిధుల నుంచి కొంత డబ్బును రాష్ట్రాలు ఉపయోగించాయి.కానీ ఈ ఏడాదితో ఈ నిధులు నిండుకోనున్నాయి.దీనిపై హార్వర్డ్ ఆర్ధికవేత్త థామస్ కేన్( Harvard economist Thomas Kane ) మాట్లాడుతూ.రికవరీ ఇంకా పూర్తి కాలేదని, సెప్టెంబర్‌లో నిధుల నిల్వ అయిపోయినప్పుడు రాష్ట్రాలు ఏం చేయబోతున్నాయో ప్లాన్ చేయాల్సి ఉందని సూచించారు.
కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయని కేన్ అభిప్రాయపడ్డారు.
రికవరీని వేగవంతం చేయడానికి వర్జీనియా చట్టసభ సభ్యులు గతేడాది అదనంగా 418 మిలియన్ డాలర్లను ఆమోదించారు.మసాచుసెట్స్ అధికారులు గ్రేడ్ స్థాయి కంటే వెనుకబడిన నాల్గవ , ఎనిమిదవ తరగతి విద్యార్ధులకు గణిత బోధనను అందించడానికి 3.2 మిలియన్ డాలర్లు, అక్షరాస్యతను మెరుగుపరచడానికి 8 మిలియన్లను కేటాయించారు.కానీ పురోగతిలో వెనుకబడిన ఇతర రాష్ట్రాల్లో కొందరు తమ వ్యూహాలను మార్చుకుంటున్నారని, లేదా అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని సర్వే తెలిపింది.