దేశంలో శనివారం అన్ని దశల పోలింగ్ పూర్తి కావడం జరిగింది.దీంతో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
ఈ క్రమంలో ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala ramakrishna reddy) స్పందించారు.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమ పార్టీకి అధికారం దక్కబోతుందని సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.మహిళలు వైసీపీకి అండగా నిలిచారు.
చాలా సైలెంట్ గా వైసీపీ( YCP)కి ప్రజలు ఓట్లు వేశారు.అన్ని పార్టీలు ఏకమైన వాళ్ళు గెలవడం లేదు.
ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏది ఏమైనా జూన్ 4వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలే వస్తాయని తమ నమ్మకం అని పేర్కొన్నారు.
వైనాట్ 175 అని తాము అనటానికి అనేక కారణాలు ఉన్నాయని ఆదిశగా తమను అడ్డుకో లేకపోతే అందుకు కూటమి పార్టీలే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.తమను వ్యతిరేకిస్తున్న వాళ్ళ గొంతుక బలంగా ఉందని దానికి తోడు అన్ని పార్టీలు కలిసాయని తెలిపారు.
సో ఇటువంటి పరిస్థితులలో గెలిచి ప్రభుత్వం స్థాపించటం అనేది పెద్ద ఘనత గానే భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారం చివరిలో చంద్రబాబు సైతం మేనిఫెస్టో హామీల గురించి చెప్పుకోలేకపోయారు.
కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.జగన్ మాత్రం తాము ఇంతకాలం చేస్తూ వచ్చిన పాలన గురించి ప్రచారం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు వివరించారు.
అందుకే వైసీపీ ధైర్యంగా ప్రజలను ఓట్లు అడగగలిగిందని రేపు ఎన్నికల ఫలితాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.