తెలంగాణ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే.. ఆ పార్టీలకే ఫలితాలు అనుకూలం!

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గత నెల 13న లోక్ సభ ఎన్నికలు జరిగాయి.లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమించాయి.

 Telangana Lok Sabha Exit Polls Results Favour To These Parties Details Here ,tel-TeluguStop.com

అయితే తెలంగాణ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్( Telangana Lok Sabha Exit Polls ) ఫలితాలు కాంగ్రెస్, బీజేపీ( Congress , BJP )లకు అనుకూలంగా ఉన్నాయి.లోక్ సభ ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ కు ఆశించిన ఫలితాలు రావడం కష్టమని తేలిపోయింది.

Telugu Congress, Exit, Telanganalok, Ts-Politics

ఆరా మస్తాన్ సర్వే ప్రకారం 7 నుంచి 8 స్థానాల్లో కాంగ్రెస్ 8 నుంచి 9 నుంచి బీజేపీ విజయం సాధించనుంది.పోల్ ల్యాబొరేటరీ సర్వే లెక్కల ప్రకారం కాంగ్రెస్ కు 8 నుంచి 10 స్థానాల్లో అనుకూల ఫలితాలు రానుండగా బీజేపీ 5 నుంచి 7 స్థానాల్లో గెలవనుంది.బీ.ఆర్.ఎస్ 0 నుంచి ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయని
ఈ సర్వే చెబుతోంది.ఇండియా టీవీ 6 నుంచి 8 స్థానాల్లో కాంగ్రెస్, 8 నుంచి 10 స్థానాల్లో బీజేపీకి గెలుపు ఖాయమని ఒక స్థానంలో బీ.ఆర్.ఎస్ గెలిచే అవకాశాలున్నాయని చెబుతోంది.

Telugu Congress, Exit, Telanganalok, Ts-Politics

ఆపరేషన్ చాణక్య సర్వే కాంగ్రెస్ ఏడు స్థానాల్లో, బీజేపీ( BJP ) 8 స్థానాల్లో విజయం సాధిస్తాయని వెల్లడించింది.పోల్ స్ట్రాట్ సర్వే కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాలకు పరిమితం అవుతుందని బీజేపీ 8 నుంచి 10 స్థానాల్లో గెలవనుందని బీ.ఆర్.ఎస్ కు ఒక స్థానంలో చాన్స్ ఉందని పేర్కొంది.పార్థ చాణక్య సర్వే ప్రకారం కాంగ్రెస్ 9 నుంచి 11 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉండగా బీజేపీ 5 నుంచి 7 స్థానాల్లో గెలవనుంది.టీవీ9 ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ 8 స్థానాల్లో బీజేపీ 7 స్థానాల్లో బీ.ఆర్.ఎస్ ఒక స్థానంలో గెలవనుంది.టైమ్స్ ఆఫ్ ఇండియా 5 నుంచి 8 స్థానాలలో కాంగ్రెస్ కు గెలుపు దక్కనుందని బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో సత్తా చాటనుందని బీ.ఆర్.ఎస్ కూడా 2 నుంచి 5 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని పేర్కొంది.ఏబీపీ సీ ఓటర్ సర్వే కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాలకు పరిమితమవుతుందని బీజేపీ 7 నుంచి 9 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది.

ఎం.ఐ.ఎం ఒక స్థానంలో గెలుస్తుందని అన్ని సర్వేలు వెల్లడించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube