సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి ప్రణీత( Pranitha ) ఒకరు.అయితే ఈమె మొదటి హీరోయిన్ కంటే కూడా ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి.పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరమైనటువంటి ఈమె బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ప్రణీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె అలాగే తన భర్తకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొనే ఈమె అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తుంటారు.అయితే తాజాగా ప్రణీత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది.
ఇందులో భాగంగా ఈమె బాత్ టబ్ ( Bath Tub ) లో జలకాలాడుతూ తన అందాలన్నింటినీ నురగతో కప్పి వేస్తూ సందడి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ భారీ స్థాయిలో ఈమె పట్ల ట్రోల్స్ చేస్తున్నారు.ఇప్పటికే బెంగళూరు మొత్తం నీటికి ఇబ్బందులు పడుతున్నారు.
అలాంటి సమయంలో ఇలా నీటిని వేస్ట్ చేయడం అవసరమా అంటూ కామెంట్లు చేయగా అసలు ఇది ఇండియాలోనే కాదు అంటూ ఈమె రిప్లై ఇచ్చారు.ఇక మరికొందరైతే ఆ నురగ కూడా పక్కకు తీసేయ్ ఒక పని అయిపోతుంది అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు ముందు ఈ ఫోటో డిలీట్ చేయండి అంటూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.