టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి(Vishwak Sen, Neha Shetty, Anjali) ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి(gangs of godavari).కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మే 31వ తేదీన విడుదల అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది.
ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో హీరో విశ్వక్ సేన్( viswak sen), డైరెక్టర్ కృష్ణచైతన్య(Krishna Chaitanya) ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా రివ్యూలపై విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు.ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.బుక్ మై షో వాళ్లు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి.టికెట్ కొన్నవారికే రివ్యూ ఇచ్చేలా ఉండాలి.
కానీ ఇక్కడ ఎంతమంది ఇచ్చినా తెలిసిపోతుంది.ఎవరో పని గట్టుకొని టార్గెట్ చేస్తున్నారు.
కానీ ఎవరు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు.
సినిమాకి సంగీతం బాగాలేదని కొందరు రివ్యూల్లో రాశారు.అక్కడే వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైపోయింది.ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది.
చూడకుండానే ఉదయం ఐదారు గంటలకే రివ్యూ(Reviews) ఇచ్చారు.సినిమాలో వీక్ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదు అని తెలిపారు హీరో విశ్వక్సేన్.
ఈ సందర్భంగా విశ్వక్సేన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.