ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్( AP Election Exit Polls ) వివిధ సర్వే సంస్థలు ప్రకటించడం జరిగింది.ఈ క్రమంలో సర్వే సంస్థలలో ఎప్పటినుండో క్రెడిబిలిటీ ఉన్న ఆరా మస్తాన్( Aaraa Mastan ).
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం జరిగింది.ఏపీలో మరోసారి వైసీపీ గెలవబోతున్నట్టు స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు జరిగిన ఎన్నికలలో వైసీపీ పార్టీ 49.41% ఓట్లు సాధించి 94 నుండి 104 స్థానాలలో గెలవబోతుందని ఆరా మస్తాన్ తెలియజేశారు.అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లు సాధించి 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతుందని పేర్కొన్నారు.సుమారుగా రెండు శాతం ఓట్ల అధిక్యతతో టీడీపీ కూటమి కంటే 20 నుండి 25 స్థానాలలో గెలిచి మరోసారి వైసీపీ ఏపీలో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నట్లు ఆరా మస్తాన్ పేర్కొన్నారు.
మహిళలు అదేవిధంగా గ్రామీణ ఓటర్లు వైసీపీ( YCP )కి ఎక్కువగా ఓటు వేసినట్లు పేర్కొన్నారు.గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల కారణంగా బీసీలలో కూడా గణనీయమైన ఓట్లు సాధించిందని స్పష్టం చేశారు.ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీల ఓట్లు కూడా రాబట్టుకోవటం.
మహిళలలో వైసీపీ తన ఓటు బ్యాంకు పెంచుకోవడంతో.వైసీపీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని ఆరా మస్తాన్ వివరించారు.
ఏపీలో 25 పార్లమెంటు స్థానాలలో 13 నుండి 15 పార్లమెంటు స్థానాలు వైసీపీ గెలవబోతుందని పేర్కొన్నారు.అలాగే తెలుగుదేశం కూటమి 10 నుండి 12 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేశారు.