తెలంగాణ పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఆరా మస్తాన్ ..!!

తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై( Telangana Parliament Elections ) ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు ఆరా మస్తాన్.ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాలలో బీజేపీ గెలవబోతుందట.

 Telangana Parliament Election Exit Polls Announced By Aaraa Mastan Telangana Par-TeluguStop.com

బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదట.కేసీఆర్ అధికారం నుండి దిగిపోయిన తర్వాత కాలేశ్వరం ప్రాజెక్టు పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఫోన్ టాపింగ్.

ద్వారా బీఆర్ఎస్ భవిష్యత్తు తలకిందులైందని ఆరా మస్తాన్ తెలియజేశారు.

దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ ( BRS )నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )7 నుండి 8 చోట్ల గెలిచే అవకాశం ఉంది అని తెలిపారు.హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన ఎంఐఎం.

గెలిచే అవకాశం ఉందని ఆరా మస్తాన్ చెప్పుకొచ్చారు.తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికలలో మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో ఎంఐఎం, నాలుగు స్థానంలో బీఆర్ఎస్ ఉన్నట్లు ఆరా మస్తాన్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఊహించని విధంగా ప్రజలు తమ తీర్పు ఇచ్చినట్లు ఆరా మస్తాన్ స్పష్టం చేశారు.గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తోపాటు ఏపీ ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రకటించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube