తెలంగాణ పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఆరా మస్తాన్ ..!!
TeluguStop.com
తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై( Telangana Parliament Elections ) ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు ఆరా మస్తాన్.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాలలో బీజేపీ గెలవబోతుందట.
బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదట.కేసీఆర్ అధికారం నుండి దిగిపోయిన తర్వాత కాలేశ్వరం ప్రాజెక్టు పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఫోన్ టాపింగ్.
ద్వారా బీఆర్ఎస్ భవిష్యత్తు తలకిందులైందని ఆరా మస్తాన్ తెలియజేశారు. """/" /
దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ ( BRS )నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ( Congress Party )7 నుండి 8 చోట్ల గెలిచే అవకాశం ఉంది అని తెలిపారు.
హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన ఎంఐఎం.గెలిచే అవకాశం ఉందని ఆరా మస్తాన్ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికలలో మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో ఎంఐఎం, నాలుగు స్థానంలో బీఆర్ఎస్ ఉన్నట్లు ఆరా మస్తాన్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఊహించని విధంగా ప్రజలు తమ తీర్పు ఇచ్చినట్లు ఆరా మస్తాన్ స్పష్టం చేశారు.
గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తోపాటు ఏపీ ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రకటించడం జరిగింది.
రోడ్డు మధ్యలో టీ తాగుతూ రీల్స్.. రిజల్ట్ మాములుగా లేదుగా.. వైరల్ వీడియో!