రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla ) సరిహద్దు గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి, పెద్దమ్మ గుడి ప్రాంతం అటవీలో ఈ వేసవి కాలం అంతా వారానికి మూడుసార్లు అరటి పండ్లు పుట్నాలను వేసి వానరాల ఆకలినీ తీర్చాడు ప్రకాష్ .ఇలా ఆరు సంవత్సరాలుగా అరటి పండ్లను పుట్నాలను కోతులకు ఆహారంగా పంచి మూగజీవుల ఆకలిని తీరుస్తున్నాడు.
అటవీలో ఆకలితో అలమటిస్తున్న కోతులు బాటసారుల వెంటపడి రోజు నిత్యం ఆకలితో దీనంగా చూస్తున్న వైనాన్ని చూసి ప్రకృతి ప్రకాష్ కనీసం వారానికి మూడుసార్లు అయినా తన సొంత ఖర్చులతో కోతులకు ఆహారాన్ని పంచుతూ పక్షులకు చిరు విత్తనాలను చల్లుతున్నాడు.శనివారం గంభీరావుపేట అడవికి వెళ్ళి కోతులకు 18 డజన్ల అరటిపళ్లను మూడు కిలోల పుట్నాలను వేసి కోతుల ఆకలి తీర్చాడు.
ప్రకృతి ప్రకాష్( Prakash ) మాట్లాడుతూ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యాలలో డబ్బులు వృధా చేయకుండా నోరులేని జీవుల ఆకలిని తెలుసుకొని వాటి ఆకలిని తీర్చితే పుణ్యం వస్తుందని ప్రజలు మేధావులు స్వచ్ఛంద సంస్థలు ఎండలు మండుతున్న తరుణంలో వర్షాలు పడే వరకు అయినా మూగజీవుల ఆకలిని తీర్చాలని కోరారు.అడవుల్లో మూగజీవులను వేటాడడం, అడవుల నరికివేత ద్వారా అడవుల్లో అలజడుల, కారణంగా మూగజీవులు పల్లెకు బాటలేస్తున్నాయని అన్నారు.
జీవజలం, జలం ఎక్కడ ఉంటే జీవులు అక్కడ జీవిస్తాయని అడవులలో గుట్టలలో సైతం కుంటలను తవ్వాలని అడవిలో కాసిన పండ్లు పలాలను మూగజీవులు తింటూ అక్కడే నీళ్లు తాగుతూ జీవిస్తాయని అడవులు నరికివేత గుట్టలు బండలు ధ్వంసం అడవులలో అలజడలు కావడంతోనే మూగజీవులు కోతులు( Monkeys ) బెదిరి పల్లెబాట పట్టి ప్రజలపై దాడులు చేస్తున్న అని అన్నారు.మనుషులు తమ స్వార్థాల సంపద కోసం చేస్తున్న అక్రమాలు నేడు పట్టణ పల్లెలకు శాపంగా మారాయనీ ఇకనైనా ప్రజలు మేలుకుంటేనే తప్పా , పల్లెలన్నీ మూగజీవులతో నిండి మూగజీవులకు ప్రజలకు పోరాటం తప్పదని అన్నారు రానున్న కాలంలో అడవులను పచ్చగా ఉంచడంతో పాటు సంరక్షించాలని వాటిలో పండ్ల మొక్కలను సైతం నాటాలని అన్నారు, అద్ద రాత్రుల సమయంలో వేటగాళ్లు ఉచ్చులను పన్ని వేటకుక్కలతో మూగజీవులను నెమ్మళ్లను అటవీ, పల్లె ప్రాంతాలలో ఉచ్చులు బిగించి వాటిని చంపి మాంసాలను గుట్టు చప్పుడు కాకుండా పల్లెల్లో విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అడవుల్లో నిగా కరువైందని అన్నారు.గత నెల క్రితం కోనరావుపేట మండలం అక్కపళ్లి అడవుల్లో నరకబడ్డ చెట్లే అడవులకు రక్షణ లేకుండా పోయిందని ఆ చెట్లే సాక్ష్యం అని అన్నారు.
ఇకనైనా అడవులను రక్షించాలని అడవులకు వెళ్లే దారులపై పైనిఘా ఉంచాలని.అడవులకు వెళ్లే దారులు సీసీ కెమెరాలను బిగించాలని అన్నారు.