బిసి ఎస్సీ ఎస్టీ , మైనారిటీ ల దేవుడు అంబేద్కర్ బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజ్యాంగ నిర్మాత, మహాదార్శనికుడు, సామాజిక న్యాయ పోరాట రథసారథి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సచివాలయం సమీపంలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచ చరిత్రలో నే భవిష్యత్తు తరాలు కూడా గుర్తుంచుకునేలా 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించి జాతీకి అంకితం ఘనంగా వేడుకలు చేశారనీ బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి స్థానిక దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం 132 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి,ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు కనబడుతున్న దేవుడు అంబేద్కర్ అని ఆయన అన్నారు.
రాష్ట్ర కొత్త సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నామకరణ చేసినందుకు రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాల నాయకుడే కాదు.
అందరి వాడన్నారు.రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దకపోతే వైరుధ్యాలు దేశాన్ని నాశనం చేస్తాయని ఆనాడే అంబేద్కర్ హెచ్చరించారని ఆయన గుర్తు చేశారన్నారు.
సామాజిక న్యాయం, ప్రజాస్వామిక ఔన్నత్యం, జాతీయ సమైక్యతకు అంబేద్కర్ సమున్నత ప్రతీక.‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే ఆయన బోధనలను బిఆర్‌ఎస్ పార్టీ ఆచరణలో చూపిన తమ నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ, తెలంగాణ ప్రయోజనాలకు, హక్కులకు విఘాతం కలిగిన ప్రతిచోటా పోరాడుతూ.14 ఏండ్లపాటు అంబేద్కర్ చూపిన బాటలో నడిచి, ఆయన రాసిన రాజ్యాంగం ఆధారంగానే రాష్ట్రం సాధించుకున్న పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ అని వివరించారు.అనంతరం జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ భారతదేశ ఆధునిక రాజకీయాల్లో అంబేద్కర్‌ను మించిన గొప్ప వ్యక్తి, మహానుభావుడు ఎవరూ లేరని అన్నారు.రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా మూల కారణం అంబేద్కర్ అని, రాజ్యాంగంలో ఆర్టికల్-3 లేకపోతే, కొత్త రాష్ర్టాలకు అవకాశం ఇవ్వకపోతే.
ఈ రోజు మనకు సొంత రాష్ట్రమే లేదని.ఈ తీర్మానం ప్రవేశపెట్టడం తన అదృష్టమని చెప్పారు.రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు, సామాజిక విప్లవకారుడు, ఆర్థిక నిపుణుడు, రాజకీయ తత్వవేత్త, పీడిత ప్రజల ప్రియ బాంధవుడు అంబేద్కర్ అని కొనియాడారు.అలాగే సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ , జై భీమ్ యూత్ అధ్యక్షులు జితేందర్ లు మాట్లాడుతూ సామాజిక న్యాయం, ప్రజాస్వామిక ఔన్నత్యం, జాతీయ సమైక్యతకు అంబేద్కర్ సమున్నత ప్రతీక అని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనం అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్యం-విద్య అనే పుస్తకంలో ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం చెప్పారని వారు కొనియాడారు.
నేను రాసిన రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే దాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే’ అంటూ అంబేద్కర్ చెప్పిన మాటలను వారు గుర్తు చేశారు.
ఆ రోజుల్లోనే మహిళల హక్కుల కోసం పోరాడి.తన పదవిని వదులుకున్నారని కీర్తించారు.
ఆయన ఎంతో శ్రమకోర్చి, ఎంతో సమయాన్ని వెచ్చించి హిందూకోడ్ బిల్లును రూపొందించారని చెప్పారు.అందులో మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు, వారసత్వ హక్కు, బహుభార్యత్వం రద్దు వంటి ప్రగతిశీల అంశాలను పొందుపరిచారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , ఎంపీటీసీ సభ్యురాలు ఎనగందుల అనసూయ నరసింహులు , అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు ఎల్లయ్య, కొత్త చెన్నయ్య, వార్డు సభ్యులు ఎన్నిగందుల అంజలి బాబు , గడ్డమీది లావణ్య , పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ , జవ్వాజీ లింగం, కుడిమోజు దేవేందర్ , ధర్మేందర్ , దేవయ్య, రామచంద్రం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ , యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ , రేసు గణేష్, గడ్డం ఆనందం , దాస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు శరవింద్ , తిరుపతి , బాబు , హనుమయ్య , దళిత సంఘాల నాయకులు జై భీమ్ యూత్ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొని అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.