రాజన్న సిరిసిల్ల జిల్లా: విశ్వరూపం మహాసభ సన్నాహక సదస్సు ఈనెల ఆగస్టు7న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా క మందకృష్ణ మాదిగ హాజరవుతున్నట్లు వారు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మాదిగ, ఉప కులాలు, నాయకులు, మాదిగ కుల బంధువులు,పెద్ద ఎత్తున వేములవాడ పట్టణానికి తరలిరావాలని
ఆ జిల్లా సన్నహాక సదస్సును ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఖానాపురం లక్ష్మణ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో నిర్మాణం చేపట్టి సన్నాహక సదస్సు, విశ్వరూపం మహాసభను విజయవంతం చేయాలన్నారు.
వర్గీకరణ అంతిమ పోరాటంలో పార్టీలకు అతీతంగా ప్రతి మాదిగ బిడ్డ, మాదిగ ఉప కులాలు, బేడ బుడగ జంగాలు, చిందు, మాదిగ, డెక్కలీ, రెల్లి,మాస్తిన్, అన్ని ఉప కులాలు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.