ఇటీవల కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జోరు చాలా వరకు తగ్గిపోయింది.సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నప్పటికీ అందులో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే మంచి సక్సెస్ లను సాధిస్తున్నాయి.
ఇకపోతే గత ఏడాది ఒక్క స్ట్రెయిట్ హిట్ సినిమా కూడా లేదు.కానీ డబ్బింగ్ సినిమాలు అలా అలా మెరిసాయి.
ఇక ఈ ఏడాది మే నెల అనగా గత నెలలో ఒక్క సినిమా కూడా లేదు.గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మే నెల మరి దారుణంగా ఉంది.
ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా చూడలేదు బాక్సాఫీస్.స్టార్ హీరోల సినిమాలు ఏవి కూడా ఈ సమ్మర్ లో సందడి చేయలేదు.
అంతో ఇంతో ప్రభాస్ మీద హోప్స్ పెట్టుకోగా ప్రభాస్ కూడా రాకపోవడంతో మే నెల మొత్తం అంతా కూడా బాక్సాఫీస్ బోసిపోయింది.

మే నెలలో కొంచం అటు ఇటుగా అటుఇటుగా 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి.మొదటి వారంలో ఆ ఒక్కటి అడక్కు,( Aa Okkati Adakku ) బాక్( Baak ) లాంటి సినిమాలపై ఏదో కొంచం అంచనాలు ఉండేవి.కానీ అవి నెరవేరలేదు.
అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఆ ఒక్కటి అడక్కు, పెద్దగా మెప్పించలేకపోయింది.ఇక తమన్న, రాశిఖన్నా కలిసి చేసిన బాక్ సినిమా పరిస్థితి కూడా అంతంత మాత్రమే.
ఇక ప్రసన్న వదనం,( Prasanna Vadanam ) శబరి( Sabari ) లాంటి సినిమాల్ని థియేటర్లలో చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు.అటు పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా మరోసారి థియేటర్లలోకి వచ్చినప్పటికీ 4-5 స్క్రీన్స్ కు మాత్రమే దీని హంగామా పరిమితమైంది.
ఇక మే నెల రెండో వారంలో ప్రతినిధి 2,( Pratinidhi 2 ) కృష్ణమ్మ( Krishnamma ) లాంటి సినిమాలు విడుదల అయ్యాయి.

హిట్ కోసం అర్రులుచాస్తున్న నారా రోహిత్, సత్యదేవ్ కు ఈ రెండు సినిమాలు పెద్దగా కలిసిరాలేదు.ఈ సినిమాలతో పాటు వచ్చిన బ్రహ్మచారి, లక్ష్మీ కటాక్షం, ఆరంభం లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.ఇక మూడో వారంలో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.
మిరల్, దర్శిని, నటరత్నాలు ఇలా దాదాపు 5 సినిమాలు వచ్చినవి వచ్చినట్టే వెళ్లిపోయాయి.ఇక చివరగా నాలుగో వారంలో దిల్ రాజు సపోర్ట్ తో వచ్చిన లవ్ మీ సినిమా( Love Me Movie ) గ్రాండ్ గా రిలీజైంది.
అయితే తన ఫ్యామిలీ హీరో ఆశిష్ కు హిట్టివ్వలేకపోయాడు రాజు.ఇదే వారంలో వచ్చిన రాజు యాదవ్,( Raju Yadav ) సీడీ, సిల్క్ శారీ లాంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

మే 31వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,( Gangs Of Godavari ) హిట్ లిస్ట్, గం గం గణేశ, భజే వాయువేగం సినిమాలు రిలీజ్ అయ్యాయి.వీటిలో హిట్ లిస్ట్, గం గం గణేశ సినిమాల్ని పక్కనపెడితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం సినిమాలు ప్రస్తుతానికి లైమ్ లైట్లో ఉన్నాయి.ఇవి హిట్టవుతాయా బ్రేక్ ఈవెన్ అందుకుంటాయా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.మొత్తమ్మీద మే నెలలో చివరి రోజు రిలీజైన సినిమాల్ని మినహాయిస్తే నెల మొత్తంలో ఒక్కటంటే ఒక్క సక్సెస్ లేదు.







