చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ సెట్ ఖర్చు అన్ని రూ.కోట్లా.. ఎవరైనా ఇంత ఖర్చు చేస్తారా?

హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ ( Director Shankar )దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

 Rc16 Villag Back Drop Movie Set 30cr , Rc 16, Tollywood, Ram Charan, Budjet, Mon-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆర్సీ 15 సినిమాలో( RC 15 ) నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

Telugu Budjet, Ram Charan, Rc, Tollywood-Movie

ఈనెల నుంచి రామ్ చ‌ర‌ణ్ సెట్స్ లో అడుగు పెట్ట‌నున్నాడు.గేమ్ ఛేంజ‌ర్( game changer ) తో పాటు వరుసగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు చెర్రీ.గత కొద్ది రోజులుగా ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు చరణ్.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ మూవీ షూట్‌ కోసం భారీ విలేజ్‌ సెట్‌ వేస్తున్నారని ఫిలింగనర్ సర్కిల్ సమాచారం.సినిమాలో 70 శాతం షూటింగ్ ఈ సెట్‌లోనే జరుగనుందట.

అందుకే ఈ సెట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.దాదాపు 25 – 30 కోట్ల మ‌ధ్య‌లో ఈ సెట్ కి ఖ‌ర్చు అవుతుందట‌.

Telugu Budjet, Ram Charan, Rc, Tollywood-Movie

విలేజ్ సెట్ స‌హా బ్యాక్ డ్రాప్ బాగా ఓల్డ్ కావ‌డంతో అంత స‌హ‌జ‌సిద్దంగా రావాలంటే? ఆ మాత్రం ఖ‌ర్చు త‌ప్ప‌నిస‌రిగా భావించి నిర్మాణ సంస్థ ఎక్క‌డా వెన‌క్కి తగ్గ‌కుండా వెచ్చిస్తోందట‌.ఈ బడ్జెట్ కేవ‌లం ఈ ఒక్క సెట్ కోస‌మేన‌ట‌.అద‌నంగా నిర్మించాల్సిన చాలా సెట్స్ కి సంబంధించి ఇంకా బ్యాకెండ్ వ‌ర్క్ జ‌రుగుతుందట‌.వాటి కోసం కూడా భారీగానే ఖ‌ర్చు అవుతుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి అందుతోన్న సమాచారం.70 శాతం షూటింగ్ అంతా సెట్స్ లోనే కాబ‌ట్టి సెట్స్ కే ఎక్కువ బ‌డ్జెట్ కేటాయిస్తున్న‌ట్లు తెలుస్తోంది.ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చెర్రీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు వివరాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube