మామూలుగా మనలో చాలామంది పాములు కనబడితే చాలు అమాంతం దూరంగా వెళ్ళిపోతాము.కొంతమందికి పాములు కనబడితేనే ఒళ్లంతా జలకరిస్తుంది.
ఇక ఏదైనా టైం రాలేనప్పుడు పెద్ద పెద్ద పాముని చూస్తే నిజంగా ప్రాణాలు పోయినంత పని అవుతుందని ఎటువంటి అతిశయోక్తి లేదు.ఇక పొరపాటున అవికాస్త దగ్గరగా వస్తే మాత్రం ప్రాణాలు విడిచి అవకాశం కూడా లేకపోలేదు.
అయితే మన భారతదేశంలో పిల్లలు, కుక్కలను పెంచుకునేలాగా చాలా విదేశాలలో పాములను పెంపుడు జంతువులుగా పెంచుకునేవారు చాలానే ఉన్నారు.వారు వాటితో ప్రయాణించడం వారి వాటితో ఆడుకోవడం వాటితో పడుకోవడం లాంటి దినచర్యలను ప్రతిరోజు చేస్తుంటారు.
ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఇదివరకే వైరల్ గా మారాయి.తాజాగా ఇలాంటి వీడియో మరొకటి నెట్టెంత వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు( King Cobra ) షాంపుతో స్నానం చేయిస్తున్నట్లుగా కనబడుతుంది.ఇప్పటివరకు చాలామంది వాటితో ఆడుకోవడం తప్పించి పాముకు స్నానాలు చేపించడం లాంటి వీడియోలు ఎక్కడ చూసింది లేదు.అయితే ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా కింగ్ కోబ్రాకే స్నానం చేపిస్తున్నాడంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం.అది కూడా అచ్చం మనుషులు మాదిరిగానే కింగ్ కోబ్రాపై నీళ్లు పోసి షాంపూతో శుభ్రం చేస్తున్నాడు.

ఆ వ్యక్తి ఆ పాముకు షాంపు వేసి స్నానం చేపిస్తున్న కానీ అంత పెద్ద కింగ్ కోబ్రా అతనిది ఏమీ అనకుండా అతనికి సపోర్టుగా ఉండిపోతుంది.చిన్న పిల్లలకు ఎలా స్నానం చేపిస్తే వాళ్ళు అల్లరి చేస్తూ స్నానం చేపించుకుంటారో.అలాగే పాము కూడా అతడి పైకి అటు ఇటు తిరుగుతూ స్నానం చేయించుకుంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఓరి నాయనో వీడి టాలెంట్ ముందర ఏ టాలెంట్ పనికిరాదు అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే., ఈ వీడియో చూడ్డానికే భయమేస్తోంది., అలాంటిది అతడు అంత పెద్ద పాముతో ఎలా ఉంటున్నాడో అంటూ కామెంట్ చేస్తున్నారు.







