ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన కేటీఆర్..!!

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్( Exit polls) శనివారం సాయంత్రం విడుదలయ్యాయి.ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలిచే అవకాశాలు లేవని మెజారిటీ సంస్థలు ప్రకటించాయి.

 Brs Working President Ktr Reacts On Exit Polls , Brs, Ktr, Exit Polls, Bjp, Cong-TeluguStop.com

ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో గులాబీ దళం డీల పడింది.దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) స్పందించారు.

జూన్ 4వ తారీఖు వచ్చే అసలు ఫలితాలు కోసం తాము ఎదురుచూస్తున్నట్లు మీడియాతో స్పష్టం చేశారు.అటు కేసీఆర్ పోరాటంతో పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ మరియు బీజేపీ( BJP ) రెండు జాతీయ పార్టీలు భారీ ఎత్తున పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నట్లు సర్వే సంస్థలు తెలియజేశాయి.ప్రధానంగా బీజేపీ అత్యధిక మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నట్లు అనేక సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో ప్రకటించడం జరిగాయి.ఇండియా టుడే సర్వే కూడా ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగింది.తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ 11 నుంచి 12, కాంగ్రెస్ 4 నుండి 6, బీఆర్ఎస్ 0 నుండి 1, ఎంఐఎం 1 స్థానం గెలిచే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

దేశవ్యాప్తంగా ఈసారి ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తుది దశ ఎన్నిక నేడు ముగిసింది.దీంతో సాయంత్రం ఆరున్నర గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడం జరిగాయి.ఇక అసలైన ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube