ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు ఎన్నికల ముగిశాయి.ఈ క్రమంలో జూన్ మొదటి తారీకు శనివారం ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు ప్రకటించడం జరిగింది.
మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు తెలియజేశాయి.ఆ సర్వే ఎగ్జిట్ పోల్స్ సంస్థల లిస్టు చూస్తే.సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ 95 నుంచి 105 స్థానాలతో వైసీపీ అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేసింది.95 నుంచి 13 స్థానాలతో వైసీపీ గెలుస్తుందని జన్మత్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం జరిగింది.ఆరా మస్తాన్( AARAA Mastan Survey ) 94 నుంచి 14 స్థానాలు గెలిచి రెండోసారి వైసీపీ గెలుస్తున్నట్లు పేర్కొన్నారు.110 నుంచి 120 స్థానాలతో వైసీపీ గెలవబోతున్నట్లు చాణిక్య ఎగ్జిట్ పోల్ సంస్థ పేర్కొంది.125 స్థానాలతో వైసీపీ గెలుస్తున్నట్లు రేస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది.158 స్థానాలతో వైసీపీ గెలుస్తున్నట్లు వ్రాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్( పోల్ పేర్కొంది.
2024 ఏపీ ఎన్నికలను వైసీపీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అనేక సర్వేలు చేసుకుని నిర్ణయాలు తీసుకున్నారు.సామాజిక సమీకరణ ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేశారు.ఎన్నికల ప్రచారంలో కూడా చాలా వ్యూహాత్మకంగా ప్రసంగాలు చేయడం జరిగింది.చాలావరకు తన ఐదేళ్ల పాలన నచ్చితేనే ఓటేయండి అని జగన్ ప్రసంగాలు చేయడం జరిగింది.ఈ క్రమంలో అనేక క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలు జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావటానికి సంక్షేమ పథకాలే( Welfare schemes ) కారణం అని చెబుతున్నాయి.
అంతేకాదు మహిళా ఓటర్లు ఈసారి భారీ ఎత్తున జగన్ కి బ్రహ్మరథం పట్టారని చెబుతున్నారు.ఒకపక్క తన ఓటు బ్యాంకు కాపాడుకొని మరోపక్క బీసీ ఓటు బ్యాంకులో చీలిక తీసుకువచ్చారని.
అందువల్లే జగన్ రెండోసారి గెలుస్తున్నట్లు ప్రముఖులు తెలియజేస్తున్నారు.జూన్ 4వ తారీఖు అసలు ఫలితాలు రాబోతున్నాయి.