కృతి శెట్టి ( Kriti shetty ) ఉప్పెన ( Uppena ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగులో వరస సినిమా అవకాశాలను అందుకున్నారు.అయితే తెలుగులో ఈమె నటించిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
దీంతో తెలుగులో కాకుండా తమిళ సినిమాలలో నటిస్తూ వివిధ గడిపారు.ఇక చాలా రోజుల తర్వాత తెలుగులో హీరో శర్వానంద్ ( Sharwanand ) నటిస్తున్న మనమే( Maname ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా జూన్ 7 వ తేది విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉన్నటువంటి కృతి శెట్టి రిపోర్టర్ల నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ఈమె గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వడంతో ఇలా గ్యాప్ రావడానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్నకు కృతి శెట్టి సమాధానం చెబుతూ నేను గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందంటే అంటూ చెప్పిన సమాధానం వైరల్ అవుతుంది.
ఇక మనమే సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య( Sreeram Aditya )దర్శకుడికి వ్యవహరించబోతున్నారు.ఈ సినిమాకు కృతి శెట్టి సుభద్ర అనే పాత్రలో నటించబోతున్నారు.ఈమె లవర్‌గా, మ్యారీడ్ ఉమెన్‌గా, పిల్లాడికి తల్లిగానూ చేస్తుంది.ఇక ఈమె తెలుగులో చివరిగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకులకు వచ్చారు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు ఇంకా ఈ సినిమా తర్వాత మనమే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా ద్వారా అయిన సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.