లండన్‌ : కాల్పుల్లో తీవ్రగాయాలు .. చావు బతుకులతో పోరాడుతోన్న 9 ఏళ్ల భారతీయ చిన్నారి

తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 9 ఏళ్ల భారతీయ బాలిక యూకే ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతోంది.బాలిక వివరాలు తెలియరానప్పటికీ ఆమె భారత్‌లోని కేరళ (Kerala)రాష్ట్రానికి చెందినదిగా భావిస్తున్నారు.

 9 Year Old Indian Origin Girl Fighting For Her Life After Drive-by Shooting In L-TeluguStop.com

తూర్పు లండన్‌లోని డ్రైవింగ్ బైలో జరిగిన కాల్పుల్లో ఈ చిన్నారి తీవ్రంగా గాయపడింది.బుధవారం రాత్రి కాల్పులు జరిపినప్పుడు బాలిక హక్రీలోని కింగ్స్ ల్యాండ్ హై స్ట్రీట్ (King’s Land High Street in Hakri) ఏరియాలోని రెస్టారెంట్‌లో తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తోందని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు.

రెస్టారెంట్ వెలుపల కూర్చొన్న మరో ముగ్గురు పెద్దలు కూడా తుపాకీ కాల్పులకు గురికావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వారి పరిస్ధితి ప్రస్తుతం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.

బాలిక పరిస్ధితి మాత్రం విషమంగా ఉందని మెట్ పోలీస్ డిటెక్టిక్ చీఫ్ సూపరింటెండెంట్ జేమ్స్ కాన్వే(James Conway) ఒక ప్రకటనలో తెలిపారు.వారి కుటుంబానికి స్పెషలిస్ట్ అధికారులు మద్ధతుగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు పౌర సమాజానికి విజ్ఞప్తి చేశారు.

Telugu Indian Origin, Azish, James Conway, Kerala, Street Hakri, Malayali, Met D

ఈ ఘటనపై లండన్‌లోని మలయాళీ (Malayali) కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.బాధితులను కొచ్చిలోని గోతురుతుకు చెందిన వినయ, అజీష్ (Vinaya, Azish)వారి కుమార్తె లిసెల్ మారియాగా తెలిపారు.ఘటన జరిగిన నిమిషాల్లోనే అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారని కాన్వే వెల్లడించారు.

నిందితులు ఉపయోగించిన మోటర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని.అయితే అది దొంగిలించి తెచ్చినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలినట్లు ఆయన చెప్పారు.

Telugu Indian Origin, Azish, James Conway, Kerala, Street Hakri, Malayali, Met D

రాబోయే రోజుల్లో పూర్తి వాస్తవాలను వెలికి తీసేందుకు తాము స్పెషలిస్ట్ క్రైమ్ సహోద్యోగులతో కలిసి పనిచేస్తామని కాన్వే స్పష్టం చేశారు.ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, కాల్పులకు దారితీసిన కారణాలేమిటనే దానిపై తమ సిబ్బంది ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారని ఆయన చెప్పారు.అయితే కాల్పుల ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.ఆటపాటలతో, కేరింతలతో సరదాగా ఉన్న ఆ ప్రాంతంలో భీతావహ పరిస్ధితులు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube