మా చేతుల్లో ఉండేది అది మాత్రమే.. హీరోయిన్ కృతిశెట్టి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి( Krithi Shetty ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంటి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

 Krithi Shetty At Manamey Movie Interview, Krithi Shetty, Tollywood, Manamey Mov-TeluguStop.com

ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది.తొలి సినిమా నుంచే ఎక్స్‌ప్రెస్‌ వేగం ప్రదర్శించింది కృతిశెట్టి.

అయితే మొదటిలో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు అందుకోవడంలోకాస్త వెనకబడింది.ఇదిలా ఉంటే కృతి శెట్టి తాజాగా నటించిన చిత్రం మనమే.

ఇందులో శర్వానంద్( Sharwanand ) హీరోగా నటించాడు.

Telugu Krithi Shetty, Manamey, Sharwanand, Tollywood-Movie

ఈ సినిమా జూన్ 7వ తేదీన పేక్షకుల ముందుకి రానుంది.ఈ సందర్భంగా కృతిశెట్టి శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ కథలో మిమ్మల్ని ప్రేరేపించిన విషయాలేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.రొమాంటిక్‌ కామెడీ కథే అయినా,బలమైన భావోద్వేగాలు ఉంటాయి.చిన్నారి ఒక జంట నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి.అవి అందరికీ కనెక్ట్‌ అవుతాయి.ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ ఈ కథ సాగుతుంది.

మనమే( Manamey movie ) అనే పేరు వెనక కథే కారణం అని తెలిపింది కృతిశెట్టి.

Telugu Krithi Shetty, Manamey, Sharwanand, Tollywood-Movie

అలాగే కెరీర్‌ ఆరంభంలోనే మంచి విజయాల్ని, అలాగే పరాజయాల్నీ చవిచూశారు.కెరీర్‌లో ఈ ఆటుపోట్లని ఎదుర్కోవడం కష్టంగా అనిపించిందా? అని ప్రశ్నించగా కృతి శెట్టి స్పందిస్తూ.నాణేనికి రెండు వైపుల్నీ చూశానని చెప్పాలి.

ఎందుకంటె మంచి కథల్ని ఎంపిక చేసుకోవడం తప్ప నా చేతుల్లో ఏమీ ఉండదు.సినిమా విజయానికి నేనొక్కటే కారణం కాదనే విషయాన్ని తొలి సినిమాతోనే తెలుసుకున్నాను.

అందుకే పరాజయాలు ఎదురైనా అవి నాపై పెద్దగా ప్రభావం చూపలేదు.మన చేతుల్లో లేని విషయాలపై ఆందోళన ఎందుకనే విషయాన్ని ఈ ప్రయాణంలో తెలుసుకున్నా.

కష్టపడ్డాను అనడం కంటే నేర్చుకున్నానని చెబుతాను అని చెప్పుకొచ్చింది కృతిశెట్టి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube