దేశంలో చివరి విడత లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్( Exit Polls ) సందడి మొదలైంది.ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా( India Today Axis My India ) సంస్థ ఏపీలో వైసీపీ ( YCP ) 2 నుంచి 4 స్థానాలకే పరిమితమవుతుందని తేల్చి చెప్పింది.
మరి ఈ సంస్థ ఫలితాలలో క్రెడిబిలిటీ ఎంత అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.ఈ సంస్థ ఫలితాలు మెజారిటీ సందర్భాల్లో నిజం కాలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
2023 సంవత్సరంలో ఛత్తీస్ గఢ్ లో ఈ సంస్థ కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని భావించగా ఆ సమయంలో అక్కడ బీజేపీ ( BJP ) ఘన విజయం సాధించింది.2023 సంవత్సరంలో రాజస్థాన్ లో ఎలక్షన్స్ జరగగా అక్కడ కూడా ఈ సంస్థ కాంగ్రెస్ దే( Congress ) అధికారం అని చెప్పగా బీజేపీ విజయాన్ని సొంతం చేసుకుంది.2021 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఈ సంస్థ చెప్పగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఇలా ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ సర్వే లెక్కలన్నీ తప్పుల తడకగా ఉన్నాయి.వాస్తవానికి రాయలసీమలోని మెజారిటీ ఎంపీ స్థానాలలో వైసీపీదే విజయమని తేలిపోయింది.ఈ సంస్థ ఏపీ ఎంపీ స్థానాలకు( AP MP Seats ) సంబంధించి చెప్పిన లెక్కలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి.21 నుంచి 23 స్థానాల్లో ఏపీలో కూటమి విజయం సాధిస్తుందని చెప్పిన లెక్కలను కూటమి నేతలే నమ్మడం లేదు.
ఈ సంస్థ నిజంగానే సర్వే చేసిందా? సర్వే చేస్తే ఎన్ని శాంపిల్స్ సేకరించింది? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దాదాపుగా 75 శాతం సర్వే సంస్థలు వైసీపీదే ఏపీలో అధికారమని ఖరాఖండీగా చెబుతున్నా కొన్ని సంస్థలు మాత్రం కూటమికి మేలు చేయాలనేలా మొక్కుబడిగా సర్వే ఫలితాలను ప్రకటించాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎగ్జిట్ పోల్స్ లెక్కలే నిజమై ఏపీలో వైసీపీ అధికారంలో రానుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.