ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ చేస్తున్న సినిమా పుష్ప.లెక్కల మాస్టారు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేపడుతుంది.తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.
ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది.ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ చాలా సేపు ప్రసంగించారు.
ఆయన బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమాపై కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేసారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ అఖండ చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపాడు.
తాను ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా చెప్పవచ్చు.కానీ ఈ వేదికపైనే ఎందుకు చెప్తున్నాడో కూడా ఐకాన్ స్టార్ తెలిపాడు.

అఖండ తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో ఊపు ను తెచ్చిందని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.చాలా రోజుల తర్వాత తనకు ఈ సినిమాతో కిక్ వచ్చిందని తెలిపాడు.ఒక వ్యక్తి మ్యాచ్ ఆడి ఫస్ట్ బాల్ నే సిక్స్ కొడితే ఎంత కిక్ వస్తుందో అఖండ సినిమాతో తనకు అంత కిక్ వచ్చిందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.అఖండ ఒరవడి ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

డిసెంబర్ 17న పుష్ప సినిమా వస్తుందని ఆ తర్వాత నాని శ్యామ్ సింగరాయ్, తర్వాత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, భీమ్లానాయక్, ఆచార్య వంటి సినిమాలు వస్తున్నాయని అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను కోరుకున్నాడు.సుకుమార్ వచ్చేలా శాయశక్తులా ప్రయత్నించానని అల్లు అర్జున్ తెలిపాడు.చివరి సీన్ వరకు అలరించే అద్బుతమైన సినిమా వస్తుందని అందరికి చెప్పు అంటూ సుకుమార్ తనకి చెప్పినట్టు పుష్పరాజ్ ఈ సందర్భంగా తెలిపాడు.