నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అఖండ.మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.అఖండ థియేట్రికల్ రిలీజ్ డిసెంబర్ లో ఉంటుందని తెలుస్తుంది.అయితే ఈలోగా డిజిటల్ రైట్స్ బిజినెస్ డీల్ కుదిరిందని తెలుస్తుంది.బాలయ్య బాబు అఖండ సినిమాను డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.
భారీ మొత్తానికే అఖండ రైట్స్ డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకుందని అంటున్నారు.బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో మాస్ ఆడియెన్స్ మెప్పించే భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది.
నందమూరి ఫ్యాన్స్ మెచ్చేలా మరోసారి బోయపాటి తన మార్క్ చూపిస్తాడని అంటున్నారు.సింహా, లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ మూవీగా వస్తున్న అఖండ ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను డబుల్ చేసేలా ఉంటుందని అంటున్నారు.
అఖండ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా డిస్కషన్స్ లో ఉన్నాట్టు తెలుస్తుంది.సినిమాతో బాలయ్య కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ జరుగుతుందని టాక్.