వెబ్ సీరీస్ కోసం తమన్నా అలాంటి పాత్ర..!

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస వెబ్ సీరీస్ లతో సత్తా చాటుతుంది.ఇప్పటికే లెవెంత్ అవర్, నవంబర్ డైరీస్ వెబ్ సీరీస్ లలో నటించిన తమన్నా ఇప్పుడు మరో కొత్త వెబ్ సీరీస్ కు సైన్ చేసిందని తెలుస్తుంది.

 Tamannah Negative Role In Web Series , Amazon Prime, Milky Beauty, Negative Role-TeluguStop.com

అమేజాన్ ప్రైం చేస్తున్న యారీ దోస్తీ వెబ్ సీరీస్ లో అమ్మడు నటిస్తుందని అంటున్నారు.ఈ వెబ్ సీరీస్ లో తమన్నా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తుందని టాక్.

ఈమధ్యనే వెబ్ సీరీస్ కంటెంట్ పై హీరోయిజం ఉండదు అని కామెంట్ చేసిన తమన్నా ఇప్పుడు ఏకంగా నెగటివ్ రోల్ నటించేందుకు సై అంటుంది.

ఈ వెబ్ సీరీస్ ను అరుణిమ శర్మ డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.

వెబ్ సీరీస్ లకు ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ గా మారిన తమన్న రానున్న రోజుల్లో ఇక్కడ మరిన్ని ప్రయోగాలు చేస్తానని అంటుంది.ఇక సినిమాల విషయానికి వస్తే అమ్మడు ఎఫ్3, గుర్తుందా శీతాకాలం, మాస్ట్రో, సీటీమార్ సినిమాల్లో నటిస్తుంది.

ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా మళ్లీ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుందని చెప్పొచ్చు.సినిమాల్లో అమ్మడు గ్లామర్ షోకి ఎలాంటి అడ్డు చెప్పడం లేదని తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube