విలన్ గా ట్రై చేస్తున్న సునీల్... కొత్త టీమ్ తో కొత్త ప్రయోగం

కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోగా టర్న్ తీసుకున్న నటుడు సునీల్.అయితే హీరోగా మారిన తర్వాత కెరియర్ లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ రావడంతో సునీల్ క్రేజ్ అమాంతం పడిపోయింది.

 Actor Sunil Negitive Role In Low Budget Movie-TeluguStop.com

దీంతో మరల క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ గా టర్న్ తీసుకున్న సునీల్ కి పెద్ద సినిమాలలో అవకాశాలు వస్తున్న ఒకప్పటి తన క్రేజ్ ని తిరిగి తీసుకొచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదు.దీంతో ఇప్పుడు కమెడియన్ గా అతని లైఫ్ సందిగ్ధంలో పడింది.

ఇదిలా ఉంటే అవకాశం వస్తే విలన్ గా కూడా నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సునీల్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది.

సునీల్ నెగిటివ్ రోల్ లో ఓ సినిమాలో కనిపించబోతున్నాడు.అయితే అది ఓ చిన్న సినిమా కావడం విశేషం.

ఈ మధ్య కాలంలో కమెడియన్ గా రాణిస్తున్న సుహాన్ హీరోగా, షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రాజ్ దర్శకత్వంలో కలర్ ఫోటో అనే సినిమా ఒకటి తెరకెక్కుతుంది.ఈ సినిమాలో సునీల్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇందులో హీరోయిన్ గా తెలుగమ్మాయి చాందినీ చౌదరీ నటిస్తుంది.తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

టైటిల్ క తగ్గట్లుగానే ఫోటోకి ఫోజు ఇస్తున్న టైపులో హీరో సుహన్ లుక్ రివీల్ చేసారు.మరి ఈ సినిమాలో సునీల్ విలన్ గా ఎంత వరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube