సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ తో కలిసి స్టెప్స్ వేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.తన మాటలతో,టైటిల్స్ తో సంచలనాలు నమోదు చేసే ఆయన అప్పుడప్పుడు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఆయన తాజాగా బ్యూటీ ఫుల్ అనే మూవీ కి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.ఆయన శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 1 న విడుదల అవుతుండగా, ఈ చిత్ర యూనిట్ మియాపూర్ లోని జి యస్ మాల్ లో సందడి చేశారు.
ఈ క్రమంలో ఈ సినిమా హీరోయిన్ నాయన గంగూలీ తో కలిసి స్టార్ డైరెక్టర్ వర్మ స్టెప్స్ వేయడం విశేషం.హీరోయిన్ తో కాసేపు స్టెప్స్ వేసిన వర్మ ఆ తరువాత అక్కడ ఉన్న మహిళా అభిమానులతో కూడా వర్మ స్టెప్స్ వేశాడు.
దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
పర్త్ సూరి, నాయన గంగూలీ జంటగా నటించిన ఈ చిత్రం నూతన సంవత్సరం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వర్మ నిర్మాణ భాద్యతలు స్వీకరించారు.త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.