జెమినీ టీవీలో ప్రతీ ఆదివారి సాయంత్రం వచ్చే అమృతం సీరియల్ గురించి తెలియని వాళ్ళు ఉండరు.ఈ సీరియల్ చూస్తున్నంత సేపు నవ్వుల పువ్వులు పూస్తూనే ఉంటాయి.
అసలు నవ్వడం తెలియని వాళ్ళు సైతం ఈ సీరియల్ చూసి పడిపడి నవ్వకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు.అయితే ఇప్పుడు ఈ సీరియల్ నిర్మాతపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు మండిపడుతున్నారు.
తిట్టినతిట్టు తిట్టకుండా తుడితున్నారు.
ఇంతకీ మన ఎన్నారైలకి అంతగా కోపం రావడానికి గల కారణం ఏమిటంటే.
అమెరికాలో ఉన్న ఎన్నారైలు ఖాళీ సమయంలో కానీ సెలవు రోజుల్లో లేదా అందరూ భోజనాలు చేసే సమయంలో సరదాగా ఈ అమృతం సీరియల్ చూడటం అలవాటు.యూట్యూబ్ లో విపరీతంగా ఈ సీరియల్ కి ఆదరణ వచ్చిందంటే కారణం కేవలం ఎన్నారైలు మాత్రమే.అయితే ఈ సీరియల్ నిర్మాత యూట్యూబ్ నుంచీ ఈ సీరియల్ తీసేసి

జీ తెలుగు కి అమ్మేశారు.అంతేకాదు మీరు అమృతం సీరియల్ బాగా ఆదరించారు ధన్యవాదాలు ఇకపై ఈ సీరియల్ వీక్షించాలంటే తప్పకుండా మీరు జీ తెలుగులోనే చూడాలి అంటూ ఓ వీడియో యూట్యూబ్ లో విడుదల చేశారు.దాంతో ఒళ్ళు మండిన కొందరు ఎన్నారైలు జీ తెలుగు సబ్స్క్రైబ్ డబ్బులు ఎవడు కడుతాడు అంటూ మండిపడ్డారు.ఇదిలాఉంటే మేము ఇప్పటికే అమృతం మొత్తం డౌన్లోడ్ చేశాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.