మున్సిపాలిటీల్లో చెత్త తొలగింపునకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావం ప్రజలపై పడనీయమని మంత్రి ఆదిమూలపు పేర్కొన్నారు.సుమారు 41 మున్సిపాలిటీల్లో సమ్మె ప్రభావం లేదని చెప్పారు.
కార్మికుల డిమాండ్లపై ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపామని తెలిపారు.అలాగే మినిమం టైం స్కేల్ అమలు అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
విధులకు హాజరయ్యే వారిని అడ్డుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.