విశాఖ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్య అనుపమ బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం సేవిస్తుండగా ఇద్దరి మధ్య ఘర్షణ అనిల్ అనే వ్యక్తిని దారుణంగా కత్తి తో పొడిచి చంపిన ప్రత్యర్ధి నిందితుడు పరారు పట్టపగలు హత్యతో ప్రజల్లో ఆందోళన…
విశాఖ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.బార్లో మద్యం సేవిస్తుండగా ఇరువురి మధ్య ఏర్పడిన ఘర్షణ అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.
హతుడు విశాఖలోని ఆదర్శనగర్ చెందిన అనిల్ గా పోలీసులు గుర్తించారు.ఎంపీపీ కాలనీ ఆదర్శనగర్ లో నివాసం ఉంటున్న అనిల్ తల్లిదండ్రులు కాకినాడలో ఉంటున్నారు.
క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న అనిల్ నిన్న రాత్రి తల్లి వద్ద నుంచి విశాఖ వచ్చాడు.ఈరోజు మధ్యాహ్నం ఎంవిపి కాలనీలో అనుపమ బార్ అండ్ రెస్టారెంట్ లో శ్యామ్ అనే వ్యక్తితో కలిసి మద్యం సేవించడానికి వెళ్ళాడు.
ఆ సమయంలో ఇద్దరు మధ్య ఘర్షణ చెలరేగింది.అనంతరం బార్ నుంచి బయటికి వచ్చిన అనిల్ ను శ్యామ్ మద్యం బాటిల్ కత్తి తో పొడి చేశాడు.
దీంతో అనిల్ అక్కడికక్కడే పడిపోయాడు.బార్ సిబ్బంది వచ్చి చూసేసరికి ప్రాణం కోల్పోయి ఉన్నాడు.
విషయం తెలిసిన ఎసిపి ఈస్ట్ మూర్తి అధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.హత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్న శ్యామ్ గురించి గాలిస్తున్నారు.
అయితే ఈ హత్య పాత కక్షలతో జరిగిందా లేక ఆ క్షణం లో ఏర్పడిన ఘర్షణ తో జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతుంది.పట్ట పగలు జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు.
ముఖ్యంగా అనీల్ నివాసం ఉంటున్న ప్రాంతానికి అతి సమీపంలో హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.