రాజకీయ పలుకుబడి ఉందని అహంకారంతో తన భార్య పేరుతో నిర్మాణం అవుతున్న షాపింగ్ మాల్లో నిర్లక్ష్యానికి ఒక గిరిజన వ్యక్తి నిండు ప్రాణం బలి తీసుకుంది.తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీమంత్రి కుటుంబ సభ్యులు కు చెందిన భవన నిర్మాణం పనులు లిఫ్టులో పడి వ్యక్తి మృతి.
చింతపల్లి మండలం దారకొండ ప్రాంతానికి చెందిన గిరిజనుడు మృతి.పోలీసులు కేసు నమోదు చేసి ఏరియా హాస్పిటల్ లో మృతదేహం ని తరలించారు.
వివరాల్లోకెళ్తే టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తన భార్య పద్మావతి పేరుతో నర్సీపట్నం మెయిన్ రోడ్డు నానుకొని భారీ షాపింగ్ మాల్ నిర్మిస్తున్నారు.నిర్మాణంలో కనీస వసతులు, భద్రతా చర్యలు లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలానికి చెందిన జర్తా చందు (27) మృతి చెందాడు.
మృతుడు చందుకు ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు.పిల్లలు చిన్న వారు.
అయితే ఉదయం 10 గంటలకు చనిపోతే కనీసం సాయంకాలం ఐదు గంటల వరకు బాధిత కుటుంబ సభ్యులకు తెలపకుండా పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు స్థానిక టిడిపి నాయకులు.పొట్టకూడు కోసం వచ్చి తన భర్త ప్రాణాలు విడవడంతో ముగ్గురు చిన్న పిల్లలతో గల చందు భార్య ఆవేదన వర్ణనాతీతం…
.