ఇదేందయ్యా ఇది: బిడ్డకు జన్మనిచ్చిన మగ గొరిల్లా..?!

ప్రతీ జంతువు తన సంతానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.మాతృత్వం అనేది మనుషులకే కాకుండా జంతువులకు కూడా ఆనందం కలిగించే విషయం.

 A Male Gorilla Who Gives Birth To A Baby In Columbus Zoo..?! Gorilla, Given, Bi-TeluguStop.com

తమ పిల్లలను జంతువులు కనిపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాయి.వాటికి ఆహారాన్ని తెచ్చి పెడటం, అవి పెద్దయ్యే వరకు వాటి వెంటే ఉండటం లాంటివి చేస్తూ ఉంటాయి.

అయితే తాజాగా ఒక గొరిల్లా బిడ్డకు జన్మనిచ్చింది.జన్మనివ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

కానీ మగ గొరిల్లా అనుకుని జూపార్క్( Zoopark ) కు సిబ్బంది తీసుకురాగా.అది బిడ్డకు జన్మనివ్వడంతో అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు.

Telugu Animals, Columbus Zoo, Gorilla, Latest, Zoopark-Telugu NRI

యునైటెడ్ స్టేట్స్‌( United States )లోని ఓహియోలోని కొలంబస్ జూపార్క్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఒక గొరిల్లా జూపార్క్ లో 2019 నుంచి తన తల్లితో కలిసి ఉంటుంది.అయితే ఈ గొరిల్లాను జూసిబ్బంది మగదని ఇప్పటివరకు భాగించారు.కానీ ఇటీవల అది బిడ్డకు జన్మనివ్వడంతో సిబ్బంది కాసేపు ఆశ్చర్యపోయారు.మగ గొరిల్లా బిడ్డకు జన్మనివ్వడం ఏంటని పరిశీలన చేపట్టారు.ఈ మేరకు గొరిల్లా( Gorilla ) సంరక్షణ బృందాన్ని పిలిచి విచారణ చేపట్టారు.

దీంతో ఈ గొరిల్లా మగది కాదని, ఆడదని అప్పుడు తేలింది.ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వడంతో ఆ విషయం తెలిసినట్లు చెప్పారు.

Telugu Animals, Columbus Zoo, Gorilla, Latest, Zoopark-Telugu NRI

అయితే గొరిల్లాలు యుక్త వయస్సులో ఉన్న సమయంలో అవి ఆడవా లేదా మగవా అనేది నిర్ధారించడం చాలా కష్టంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.ఎనిమిదేళ్ల వయస్సు వచ్చిన తర్వాతే దాని లింగత్వం గురించి తెలుస్తుందని, 12 ఏళ్ల తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చెబుతున్నారు.అయితే తాము ఆ వయస్ససులో దాని లింగత్వాన్ని గుర్తించలేదని జూపార్క్ సిబ్బంది చెబుతున్నారు.ప్రస్తుతం ఈ గొరిల్లాకు పుట్టిన బిడ్డ ఆడదిగా చెబుతున్నారు.బిడ్డను ఈ గొరిల్లా ఎంతో ప్రేమగా చూసుకుకంటుందని, వాటి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు జూపార్క్ యాజమాన్యం స్పస్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube