Goat Palm Tree : ఇదేందయ్యా ఇది.. తాటి చెట్టు ఎక్కిన మేక.. చూస్తే షాకే..

మనుషులు కాకుండా చెట్లు ఎక్కే జంతువులు చాలానే ఉంటాయి.వాటిలో పులులు, పిల్లులు, సింహాలు, ఎలుగుబంట్లు, కోతులు ఇలా ఎన్నో ఉన్నాయి.

 A Goat Climbing A Palm Tree Shocking To See , Goats, Gravity, Tree Trekking, Vi-TeluguStop.com

శునకాలు మాత్రం చెట్లు ఎక్కలేవు.మేకలు, గొర్రెలు కూడా ఈ పని చేయలేవు.

కాగా తాజాగా ఒక మేక తాటిచెట్టు ఎక్కి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇది చూసి ఇదేందయ్యా ఇది మేం ఎన్నడూ ఇలాంటిది చూడలే అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ఈ మేక వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సామ్రాట్ గౌడ ట్విట్టర్‌ వేదికగా షేర్ చేశారు.

షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే 6 వేలకు పైగానే వ్యూస్ వచ్చాయి.వావ్ ఈ మేక మామూలుది కాదు, ఒక మేక చెట్టు ఎక్కడాన్ని చూడటం ఇదే ఫస్ట్ టైమ్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

కొందరు మాత్రం ఇది ఇంపాజిబుల్ అంటున్నారు.మరికొందరు ఇది ఫేక్ వీడియో అయి ఉండొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు.వీడియోలో చూస్తే ఈ మేక పైకి ఈజీగానే ఎక్కింది.తర్వాత కిందకు చాలా నెమ్మదిగా ఎవరో పట్టుకున్నట్లు దిగింది.

దీన్ని బట్టి చూస్తుంటే ఎవరో దీన్ని తాడు సాయంతో చెట్టు ఎక్కించి మళ్లీ చెట్టు దింపారనే ఒక అనుమానం కలుగుతుంది.ఏదేమైనా ఒక మేక ఎలాగోలా ఒక చెట్టు ఎక్కి అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది.

సాధారణంగా మేకలు, గొర్రెలు కొండలను అవలీలగా ఎక్కేస్తుంటాయి.కాబట్టి చెట్టు ఎక్కడ వీటికి పెద్ద కష్టమేమీ కాదని ఇంకొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోని మీరు కూడా తిలకించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube