మునుగోడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత టిఆర్ఎస్ బిజెపి మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు చోటు చేసుకునే స్థాయిలో సంఘటనలేవి జరగలేదు.కానీ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో బిజెపి కూడా స్పీడ్ పెంచింది.
ఏదో రకంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.దీనికి కేంద్ర బీజేపీ పెద్దలు కూడా మద్దతు పలుకుతుండడంతో, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు హోదాలో బండి సంజయ్ మరింత యాక్టివ్ అయ్యారు.
దీనిలో భాగంగానే నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను నేటి నుంచి ప్రారంభించేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు.ఈ నాలుగో విడత ప్రజా సంకరమయాత్రను బైంసా నుంచి ప్రారంభించదల్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ ను సంజయ్ ఆహ్వానించారు.అయితే నిన్న సాయంత్రం బైంసాకు బయలుదేరిన బండి సంజయ్ ను ముందస్తుగా పోలీసులు అడ్డుకున్నారు.
తనకు అన్ని అనుమతులు ఉన్నాయని సంజయ్ చెప్పినా, పోలీసులు మాత్రం ఒప్పుకోలేదు.

పోలీస్ బలగాలను భారీగా మోహరించడంతో బండి సంజయ్ వెనక్కి వెళ్ళిపోయారు.అయితే బండి సంజయ్ పోలీసులు అడ్డుకోవడానికి భైంసా సున్నితమైన ప్రాంతం కావడం, పాదయాత్ర చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయనే ముందస్తు జాగ్రత్తలో భాగంగా సంజయ్ ను అడ్డుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.ఈ మేరకు ఇంటెలిజెన్స్ నివేదికలను వారు ప్రస్తావిస్తున్నారు.
అయితే పోలీసులు తనను అడ్డుకోవడంపై సంజయ్ ఆగ్రహంగా ఉన్నారు.ఇక్కడ పాదయాత్ర చేస్తే బిజెపికి రాజకీయంగా మరింత బలం పెరుగుతుందని, అందుకే కేసిఆర్ ఇంటెలిజెన్స్ నివేదిక పేరుతో తన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, తాను మాత్రం పాదయాత్ర చేసి తీరుతానని సంజయ్ చెబుతున్నారు.
అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు పాదయాత్ర అనుమతి కోసం వేచి చూడాలని , ఒకవేళ అనుమతి రానిపక్షంలో కోర్టుకు వెళ్లి అక్కడే తేల్చుకోవాలి అని సంజయ్ నిర్ణయించుకున్నారు.దీంతో సంజయ్ పాదయాత్ర ముందుకు వెళ్తుందా లేక బ్రేక్ పడుతుందా అనేది కోర్టులోనే తేలే అవకాసం కనిపిస్తోంది.