ఆ బ్యూటీకి కారు విక్రయించలేమన్న బ్రాండెడ్ కంపెనీ.. కానీ అసలు కథ ఏంటంటే?

బాలీవుడ్ మల్లికా శెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న మల్లికాశెరావత్ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

 Rolly Royce Company Rejected Car Sell To Mallika Sherawat Details, Mallika Sher-TeluguStop.com

తాజాగా నటి మల్లికా శెరావత్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈమె ప్రముఖ కార్ల కంపెనీ అయిన రోల్స్ రాయిస్ కంపెనీ తనకు కారును విక్రయించలేమని, తనకు తమ కంపెనీ కారును విక్రయించడానికి నిరాకరించింది అంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా ఈమె గురించి వస్తున్న వార్తలపై నటి మల్లికా షెరావత్ స్పందించారు.ఈ క్రమంలోనే మల్లికా శెరావత్ మాట్లాడుతూ తన గురించి ప్రతి రోజూ ఎన్నో వార్తలు వస్తుంటాయి.

అలాంటి వార్తలలో ఇది కూడా ఒకటి అని ఆమె పేర్కొన్నారు.నా గురించి ఈ విధమైనటువంటి గాసిప్స్ రాయడం కోసం ఒక పాత్రికేయుడు ఉన్నాడని, తన గురించి ఇలాంటి వార్తలను రాస్తూ తాను ఒక జర్నలిస్టుగా చలామణి అవుతున్నాడని వెల్లడించారు.

Telugu Actress, Bollywood, Branded Company, Journalist, Rollsroyce-Movie

పాట్నాలో నివసించే ఈ జర్నలిస్ట్ తనకి అనుకూలంగా వార్తలు రాస్తే తనకు గిఫ్ట్ ఇవ్వడానికి నిరాకరించిన అందుకే ఇలా తన గురించి నెగిటివ్ వార్తలు రాస్తున్నారని ఆమె పేర్కొన్నారు.ఏ కంపెనీ అయినా కస్టమర్లు వారి కారును కొనుగోలు చేయడానికి వెళ్తే నిరాకరించిందని అలా ఏ కంపెనీ కూడా చేయదని, మరి నాకు కారు విక్రయించడానికి సదరు కంపెనీ ఎందుకు నిరాకరిస్తుంది అంటూ ప్రశ్నించారు.ఏది ఏమైనా మల్లికా శెరావత్ కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube