అక్కినేని నాగార్జున, దాదాపు మూడు దశాబ్దాల సిని కెరీర్, లెక్కకు మించి వేరియేషన్స్, అద్భుతమైన నటుడన్న పేరు, మన్మధుడు అనే బిరుదు .చాలా సాధించారు అక్కినేని నాగార్జున.
కాని హీరో క్రేజ్ కి కోలమానంగా చెప్పుకునే కలెక్షన్లు, రికార్డులు మాత్రం లేవు నాగార్జునకి.
క్లాస్ ఆడియెన్స్ లో మంచి అభిమానం ఉన్నా, మాస్ ప్రేక్షకులకి చేరువ కాలేదు నాగార్జున.
చిరంజీవి,బాలకృష్ణ లాంటి మాస్ ఆరాధ్యదైవాల మధ్య నలిగిపోయారు నాగార్జున.తన వారసుడిగా పరిచయం చేసిన నాగ చైతన్య కుడా అంతే … ఉన్న హిట్లు అన్ని ప్రేమకథలే …యాక్షన్ జోలికి వెళ్ళిన ప్రతిసారి దారుణంగా దెబ్బతిన్నాడు చైతు.
ఇలా అక్కినేని వంశంలో ప్రేక్షకులు నీరాజనాలు పట్టే హీరో లేకుండా పోయాడు.మిగితా సినీ కుటుంబాల పరిస్థితి భిన్నం.
బాలకృష్ణ,ఎన్టీఆర్ ఇంకా బాక్సాఫీస్ దగ్గర పందెం కోళ్లుగా ఉంటే, సూపర్ స్టార్ కృష్ణని మించిపోయి క్లాస్,మాస్,ఫ్యామిలి,ఫిమేల్, ఇలా అన్ని సెక్షన్స్ మన్ననలు పొంది, అత్యంత పాపులర్ తెలుగు హీరోగా ఎదిగాడు మహేష్.ఇక మెగా ఫ్యామిలి గురించి చెప్పక్కరలేదు.టాప్-6 హీరోల్లో ముగ్గురు ఆ కుటుంబానికి చెందిన వారే .అందులోను పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే .
మరి అక్కినేని వంశాన్ని ఎవరు మోయాలి ? మిగిలింది అఖిల్ ఒక్కడే .అందుకే నాగార్జున కసి మీద ఉన్నారు.ఏంతో మందిని కాదని మాస్ ఇమేజ్ ఉన్న వినాయక్ చేతిలో పెట్టారు అఖిల్ ని .కొత్తగా అఖిల్ ని బాలివుడ్ కి పరిచయం చేసే ప్రయత్నాలు కుడా జరుగుతున్నాయి అని టాక్.ఇప్పటికే బాలివుడ్ అగ్ర నిర్మాతతో మంతనాలు జరిగాయట.ఏం చేసైనా .అఖిల్ ని ఇటు మాస్, అటు క్లాస్ కి దగ్గర చేసి .పనిలో పనిగా పాపులర్ హీరోని చేయాలని చాలా తపనపడుతున్నారు ఆయన