రాజన్న సిరిసిల్ల జిల్లా: దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులకు 17 నెలల కారాగారా శిక్ష విధిస్తూ వేములవాడ(Vemulawada) ప్రథమశ్రేణి న్యాయమూర్తి జ్యోతిర్మయి తీర్పు వెల్లడించినట్లు బోయినపల్లి ఎస్.ఐ పృథ్వీందర్ గౌడ్ (SI Prithwinder Goud)తెలిపారు.
ఈ మేరకు ఎస్.ఐ మాట్లాడుతు బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామంలో ఎల్లమ్మ దేవాలయంలో సంఘ ప్రణయ్ మరియు షైక్ సోహెల్ (Sangha Pranai, Shaikh Sohel)అనే ఇద్దరు వ్యక్తులు దొంగ తనానికి పాల్పడగా కోదురుపాక గ్రామానికి చెందిన నాగుల నాగరాజు(Nagula Nagaraja) అనే వ్యక్తి పిర్యాదు మేరకు బోయినపల్లి పోలీస్ లు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కి తరలించగా .విచారణ అనంతరం విచారణ అధికారి మహేందర్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా సి ఎం ఎస్ ఎస్.ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు.ప్రాసిక్యూషన్ తరుపున విక్రాంత్ కేసు వాదిoచగా పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి నేరస్తులైన సంఘ ప్రణయ,షైక్ సోహెల్ లకు 17 నెలల కారాగార జైలు శిక్ష విదించినట్లు బోయినపల్లి ఎస్.ఐ తెలిపారు.