ఎమిలీ అనే ఓ విదేశీ మహిళ నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఒక చక్కటి పద్ధతిని కనుక్కున్నారు.ఆమె ఈ పద్ధతిని వీడియో ద్వారా అందరికీ తెలియజేశారు.
ఈ పద్ధతిని ఉపయోగిస్తే కేవలం రెండు నిమిషాల్లో నిద్రపోవచ్చని(sleep) చెప్పారు.ఎమిలీ చెప్పిన విధానం చాలా సులభం.
మనం పడుకున్నప్పుడు ముందుగా లోతుగా ఊపిరి పీల్చుకోవాలి.ఆ తర్వాత మనసులో ఒక ఇంటిని ఊహించుకోవాలి.
ఆ ఇల్లు మనకు తెలిసినదే అయి ఉండాలి కానీ మన ఇల్లు కాకూడదు.ఎమిలీ ఎప్పుడూ తన అమ్మమ్మ ఇంటిని ఊహించుకుంటుంది.
ఎమిలీ ఆ ఇంటిలోని ప్రతి చిన్న విషయాన్ని గమనించమని చెప్పింది.తలుపు తీసి లోపలికి వెళ్లినప్పుడు చుట్టూ ఉన్న ఫర్నిచర్, టేబుళ్ల(Furniture, tables) మీద ఉన్న వస్తువులు ఇలా ప్రతి చిన్న విషయాన్ని మనసులో గుర్తుకు తెచ్చుకోవాలి.
తన అమ్మమ్మ ఇంటిని మనసులో చూస్తూ రెండవ అంతస్తుకు చేరకముందే తనకు నిద్ర వస్తుందని ఎమిలీ చెప్పింది.

నిద్ర నిపుణుడు రెక్స్ (Sleep expert Rex)కూడా ఈ పద్ధతిని సూచిస్తున్నారు.ఒక విషయం మీద దృష్టి పెట్టినప్పుడు, శరీరం బాగా రిలాక్స్ అవుతుంది.అలాగే మనసు ఇతర ఆలోచనల నుంచి దూరంగా ఉంటుంది.
ఇది మంచి నిద్రకు చాలా ముఖ్యం.బాల్యంలోని ఇల్లు లేదా అమ్మమ్మ ఇల్లు లాంటి ప్రదేశాలను ఊహించుకోవడం మంచిది.
ఎందుకంటే అవి మనకు తెలిసినవి, మనకు ప్రశాంతతనిస్తాయి.దీంతో వాటిని మనసులో సులభంగా ఊహించుకోవచ్చు.

మనకు చాలా దగ్గరైన ఒక ప్రదేశాన్ని మనసులో ఊహించుకున్నప్పుడు, మన మనసు రోజువారీ ఆలోచనల నుండి దూరంగా ఉండి, ఆ ప్రశాంతమైన ప్రదేశంపై దృష్టి పెడుతుంది.కానీ ఒకే చోట నిలబడి ఉండకుండా, ఆ ఇంటి గదుల గుండా తిరుగుతూ ఉండటం ముఖ్యం.ఒకే చోట నిలబడి ఉంటే మన మనసు అక్కడే చిక్కుకుపోతుంది.దీంతో నిద్ర పట్టడం కష్టమవుతుంది.