జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

నల్లగొండ జిల్లా:తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను ఎస్పీ సతీమణి పూజతో కలిసి ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Bathukamma Celebrations At District Police Office , District Police Office , Ba-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ రకాల పూలతో బతుకమ్మను అద్భుతంగా పేర్చి బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు.పది రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడం మహిళలకు ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుందన్నారు.

మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పండుగ ఉత్సాహంగా జరుపుకోవడం వారిలో చైతన్యాన్ని పెంపొందిచడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరుపున బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రాములు నాయక్, ఎస్బీ డీఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి,సైబర్ క్రైమ్ డిఎస్పి లక్ష్మీనారాయణ, ఏఓ శ్రీనివాస్,సూపర్డెంట్ సబిత,సిఐలు మహాలక్ష్మయ్య,రాజశేఖర్ రెడ్డి,ఆర్ఐలు సురప్ప నాయుడు,సంతోష్, శ్రీనివాస్,నరేష్,మహిళా ఎస్ఐలు శ్రావణి,మమత, డీపీఓ మహిళా సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube